నంద్యాల జిల్లా : శిరువెళ్ల మండలం పచ్చర్ల గ్రామం లో ఎన్నో ఏండ్ల నుంచి వున్నా చెంచులకు (ఎస్టీ) చెంచు కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులే చేయించి ఇవ్వాలని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు.
పచ్చర్ల గ్రామంలో చెంచులు తమ సమస్యలను రవిరాజ్ కు విన్నవించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో చెంచుల అభివృద్ధి కోసం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టిన ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదని వారు ఆరోపించారు అక్కడ వున్నా చెంచుల పైన అధికారుల దాడులు ఆపాలని హెచ్చరించారు . చెంచులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని మొన్న జరిగిన చిరుతపులి దాడిలో మరణించిన మహిళా కుటుంబాన్నితగిన పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చిరుతపులిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
అలాగే మహానంది దేవస్థానం చుట్టూ తిరుగుతున్న చిరుతపులిని కూడా పట్టుకొని అక్కడ వున్న ప్రజలను కాపాడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. పచ్చర్ల గ్రామంలో వున్న చెంచులకు చెంచు (యస్టి) కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అందజేయ్యాలని లేకపోతె కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.