సుమారు 10 లక్షలు విలువైన 140 కిలోల గంజాయి స్వాధీనం
భీమడోలు PS
జిల్లా SP శ్రీ రాహుల్ దేవ్ శర్మ వారికి రాబడిన సమాచారం మేరకు ఏలూరు DSP శ్రీ G పైడేశ్వర రావు గారి పర్యవేక్షణలో, భీమడోలు CI V వెంకటేశ్వరరావు గారి అద్వర్యంలో భీమడోలు పోలిస్ స్టేషన్ SI మరియు సిబ్బంది ఈ మధ్యాహ్నం పోలసానిపల్లి హైవే వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ, గంజాయి రవాణా కాబడుతున్నఫలూదా ఐస్ క్రీమ్ వ్యాన్, ఒక హ్యుండై వెన్యూ కారుని గుర్తించి, అందులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోవడమైనది. ఈ రెండు వాహనాలను అదుపులోకి తీసుకొని అందులో ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్ ఘర్ కి చెందిన బెరులాల్ జాట్, ప్రవీణ్ జాట్, రతన్ ఆహిర్, లోకేష్ జాట్ అను వారు, AOB ఏజెన్సి నుండి AP21 X 4041 నెంబర్ గల TATA Ace ఐస్ క్రీమ్ వ్యాన్ RJ06CF 0442 అను నెంబర్ గల తెలుపు రంగు Hyundai Venue కారులో సుమారు 140 కేజీల గంజాయిని 7 బస్తాలలో నింపుకొని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దుర్గేష్ జాట్ కు ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ముందు రాజస్తానీలు సహజంగా రోడ్ మీద తిరుగుతూ ఫలూదా అనే పానీయం అమ్ముకోవడానికి వాడే మినీ వ్యాన్ ను స్క్రాప్ లో కొని, వాటి ఫ్రిజ్ లలో ఎవరికీ అనుమానం రాణి రీతిలో గంజాయిని సర్ది, మిగిలింది ఖరీదైన కొత్త కారులో రవాణా చేస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మందిని నిందితులు ఉన్నట్టు నిర్దారించి అందరిపై కేసు నమోదు చేస్తూ, 140 కేజీల గంజాయిని, దాన్ని రవాణా చేస్తున్న ఈ రెండు వాహనాలను కూడా సీజ్ చేయడమైనది.
• అరెస్ట్ కాబడిన నిందితులు:
- పెరులాల్ ఝాట్ S/o సర్కార్ లాల్ ఝాట్, 35 సం. లు, C/ ఝాట్,
కేరియఖేడ్ గ్రామము, మండోల్ మండలము, బిల్వారా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రము. - ప్రవీణ్ ఝాట్ S/o ప్రుద్వి రాజ్ ఝాట్, 20 సం.లు. C/ ఝాట్,
తుర్కి కలహ గ్రామము ,చిత్తోర్ ఘర్ జిల్లా ,రాజస్తాన్ రాష్ట్రం. - రతన్ ఆహీర్ S/o ఉదయ్ రామ్ ఆహీర్, 29 సం.లు., C/ ఆహీర్, లక్ష్మిపుర గ్రామము, గంగాపూర్ థానా, భిల్వారా జిల్లా, రాజస్తాన్ రాష్ట్రము.
- లోకేష్ ఝాట్, S/o మిత్తులాల్ ఝాట్, 24 సం.లు., C/ ఝాట్, తుర్కికలహ గ్రామము, చిత్తోర్ ఘర్ జిల్లా, రాజస్తాన్ రాష్ట్రము
దర్యాప్తులో పాల్గొన్న పొలిసు సిబ్బంది
భీమడోలు CI V వెంకటేశ్వరరావు, SI చావా సురేష్
హెడ్ కానిస్టేబుల్ D శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ అబ్దుల్ మజీద్, శ్రీనివాస్, గోపాల కృష్ణ, ఆంజనేయులు, నాగ ఆంజనేయులు.