బనగానపల్లెలో ఇంటికి తాళం పగలగొట్టి దోపిడీ చేసిన దుండగులు.
- 23 తులాల బంగారు ఆభరణాలు , 2 లక్షల నగదు దోచుకెళ్లిన దొంగలు
- దొంగల పాలైన పిల్లల చదువు కోసం దాచుకున్న నగదు డబ్బులు .
- ఇంటికి తాళం వేసి కసాపురం వెళ్లిన కుటుంబీకులు,
నంద్యాల జిల్లా బనగానపల్లె లో అమ్మవారి శాల వీధిలో నివాసముంటున్న రవికుమార్ అనే వ్యక్తి ఇంటికి తాళం పగలగొట్టి సుమారు 12 లక్షల విలువైన 23 తులాల బంగారు ఆభరణాలు 2 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు.
గత రెండు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నిమిత్తం వెళ్లారు.
ఇంటికి తాళం పగలగొట్టి ఉండడం గమనించిన చుట్టుపక్కల ఇళ్ల యజమాని రవికుమార్ కు సమాచారం అందించడంతో హుటా హుటిన కసాపురం నుండి తిరిగి వచ్చేశారు ఇంటిలోనికి వెళ్లి బీరువాను పరిశీలించగా బీరువా తలుపులు తెరచి ఉండడంతో పాటు బీరువాలో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు కనిపించకపోవడంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు సంబంధించి దాచి పెట్టుకున్న బంగారాన్ని నగదు మొత్తం దొంగలు అపహరణ చేయడంతో బాధ్యత కుటుంబ సభ్యులు లబో దిబోమంటు కన్నీరు మున్నీరయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.