నంద్యాల జిల్లా కోయిలకుంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ విపక్షాలను టార్గెట్ చేసుకొని జీవో నెంబర్ వన్ ను జారీచేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు.
తెలుగుదేశం పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఈ జీవో ద్వారా ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ప్రజల్లో ఉన్న అసౌకర్యమైనటువంటి విధానాలను చంద్రబాబు కార్యక్రమాలకు వచ్చే ప్రజలను చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు జీవో లు అమలు చేసిన ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ఏది ఏమైనాప్పటికీ జగన్మోహన్ రెడ్డి 175 కి 175 సీట్లు వస్తాయి వై నాట్ అనే చెప్పే జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు నీకు ప్రజలపై విశ్వాసం ఉంటే నీ పరిపాలన పైన నమ్మకం ఉంటే వెంటనే ఈ జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మరింతగా వ్యతిరేక విధానాలను ప్రజల లోకి తీసుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ విధానాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర ఎక్కడ విజయవంతమై ప్రజల్లో మార్పు వస్తుందోనన్న భయంతోనే ఇలాంటి జీవోలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.అక్రమ కేసులకు భయపడం వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.అలాగే కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు సుబ్బారెడ్డిపై పోలీసులతో బలవంతంగా కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్యల పోరాటంలో అక్రమ కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యానించారు.ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రతి నెల అప్పులు తెచ్చుకోవడానికి సమయం సరిపోతుందని, అలాగే రైతులకు ఇవ్వవలసిన బాకీలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల నాయకులు,పట్టణ నాయకులు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు