నంద్యాలజిల్లా ఆత్మకూరు, ఆర్టీసి డిపోలో నేషనల్ మజ్దూర్ యూనిటి అసోషియేషన్ నాయకులు, ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు.
RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిమాండ్లని పరిష్కరించాలని
రెండు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా RTC ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై పెరుగుతున్న భారం, వేతనాల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
- 1) డ్రైవర్, కండక్టర్ పోస్టులను నిష్పత్తిలో భర్తీ చేయాలి
- 2) మాన్యువల్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని రద్దు చేసి, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేయాలి,
- 3) పెండింగ్‌లో ఉన్న DAలు, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి,
- 4) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి,
- 5) ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లు, చార్జ్ మెమోలు రద్దు చేయాలి,
- 6)ఉద్యోగుల కుటుంబాలకు హెల్త్ కార్డ్ సౌకర్యం పూర్తి స్థాయిలో అమలు చేయాలి,
- 7)AAS, నేషనల్ పెన్షన్ స్కీమ్ సమస్యలకు పరిష్కారం చూపాలి,
- 8)డ్రైవింగ్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్‌లను పునరుద్ధరించాలి,
RTCలో ఖాళీల భర్తీ చేయకపోవడం వల్ల మిగిలిన ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
అదేవిధంగా కేసులు, సస్పెన్షన్లు, అనవసర క్రమశిక్షణ చర్యలతో ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలవకపోతే, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. RTC సంస్థను బలోపేతం చేయాలంటే ముందుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ M దాస్ ,
డిపో పోసెక్రటరి M-M బాషా,
ప్రసిడెంట్ కలిముల్లా , రఘురాముడు,
చీఫ్ అడ్వైజర్ సి.యన్. ఆచారి,
గ్యారేజ్ సెక్రటరీ నిజాముద్దీన్,
గ్యారేజ్ ప్రసిడెంట్ M. రెడ్డి పాల్గొన్నారు.
read morehttps://youtu.be/0f5Wecww5H8?si=ulaCVoxti08HyEII
read more https://politicalhunter.com/huge-rally-in-atmakur-against-privatization-of-medical-colleges/











