తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో శనివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన మైనార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆత్మకూరు కు చెందిన రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుసేన్ మరియు 6వ వార్డు కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్, టీడీపీ ఆర్. టి. ఎస్ ట్రైనర్ మరియు నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి మొమిన్ ముస్తఫా లు సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మొమిన్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలపై ఎప్పుడూ లేని విధంగా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించమని నారా లోకేష్ చెప్పారని ప్రజల్లో ఉండి వారికి జగన్ ప్రభుత్వం చేస్తున్న దాడులపై హామీలపై చేసిన మోసాలను వివరించాలన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న పలు సమస్యలను నాయకులు నారా లోకేశ్ కు వివరించామని వారు పేర్కొన్నారు.