ప్రజల సంక్షేమమే వైసిపి లక్ష్యం .. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
ఆత్మకూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న గడపగడప వైసిపి
పట్టణ అభివృద్ధి లో ముందుకు దూసుకెళ్తాం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా
- యువతతో పాటు ఉత్సాహంగా ముందుకు వెళుతున్న మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎం ఎ రషీద్
- అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అమలు చేయడమే వైసిపి లక్ష్యం అని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వార్డు 2,23,24, వ వార్డ్ లపరిధిలో గడపగడప వైసిపి కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఏ వార్డులో చూసిన గజమాలతో స్వాగతం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ముందుగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మరుఫ్ ఆసియా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ రషీద్ ప్రజలకు నవరత్న సంక్షేమ పథకాలకు అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యేతో పాటు కలిసి గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ సందర్భంగాస్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు చేరవేయడమే వైసిపి దేయమని ఆయన కొనియాడారు పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలకు వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారని తెలియజేశారు 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం మళ్లీ అధికారాన్ని చేపట్టబోతుందని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ పెనుగొండ శ్రీనివాసరావు పలు శాఖల అధికారులు మున్సిపల్ వైస్ చైర్మన్ మూల రాజగోపాల్ వార్డు కౌన్సిలర్ లు గురుపాటి విజయ్ చౌదరి మిట్ట కందల మహబుతుల సుల్తాన్ కలిముల రంగస్వామి గౌస్ లజాం ప్రకాష్ రావు మారుబోతుల విజయ్ పాణ్యం పార్వతి మాజీ వార్డ్ కౌన్సిలర్ తిమోతి నూర్ మొహమ్మద్ లాలూ స్వామి పాన్ భాష మరియు సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.