ఆర్థర్ వ్యక్తిత్వం.. వ్యవహార శైలి

421155725_7469621989736139_3374194736617928306_n.jpg

*ఆర్థర్ వ్యక్తిత్వం.. వ్యవహార శైలి*

కాశీపురం ప్రభాకర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్ ) వ్రాసిన వ్యాసం —– part..3

2019 ఎన్నికల ముందు ఆర్థర్ ఎవరో కూడా నాకు తెలియదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఏదో పేపర్లో వైసీపీ aspirents జాబితాలో ఆర్థర్ గారి పేరు కూడా కనిపించింది. నేను ఆ నియోజకవర్గానికే చెందిన నా క్లాస్ మేట్ అయిన ఒక అధికారికి కాల్ చేస్తే ఆయన గురించి తెలిసింది.

ఆ ఎన్నికల ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో చూసే వాడిని. అప్పటికి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పట్ల జనాల్లో క్రేజ్ పెరిగింది. దాదాపు ప్రతి సభలో కూడా బైరెడ్డి తన ఉపన్యాసంతో అలరిస్తూనే ఆర్థర్ ను కూడా పరిచయం చేసే వాడు. ఆ విధంగా ఆర్థర్ ను గెలిపించే బాధ్యతను తన భుజ స్కందాలపై వేసుకుని తిరుగులేని విజయాన్ని అందించాడు.

(రిజర్వేషన్ వ్యవస్థ లో ఉన్న లోపాలు, ఆ ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు ఎలా వచ్చి ఉంటాయి వంటి సబ్జెక్టు చివరి వ్యాసంలో చర్చిస్తాను )

ఎన్నికలు అయ్యాక దాదాపు 4 నెలలకు ఆర్థర్ గారిని కర్నూల్ లో ఒక ఫంక్షన్ లో కలిశాం. ఇందాక చెప్పిన మిత్రుడే నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత నా మిత్రుడైన ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ద్వారా మరింత సన్నిహితం అయ్యారు.

కరోనా మహమ్మారి కమ్ముకున్న రోజుల్లో ఒక స్వచ్ఛంద సంస్థ తరుపున సేవలు అందించేందుకు జిల్లా లోని పలు నియోజకవర్గాల్లో తిరిగే వాడిని. కరోనా పై అవేర్నెస్ కలిగించే పలు ఆర్టికల్స్ రాశాను. ఒకసారి నందికొట్కూరు వెళ్లి ఆర్థర్ చేస్తున్న సేవలు దగ్గరుండి పరిశీలించాను.

ఒక ప్రజా ప్రతినిధిగా కరోనా మహమ్మారి పై ఆర్థర్ చేస్తున్న పోరాటం ఎంతో అద్భుతం అనిపించింది. ఎలాంటి ఆర్భాటం, అధికార దర్పం లేకుండా ఒక బైక్ పై ఆయన గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

దాతల నుంచి సేకరించిన మాస్క్ లు, శానిటైజర్లు పంచడం, లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చూసి నేను ఆశ్చర్య పోయాను.

ఏ పార్టీ వారు తన దగ్గరికి వచ్చినా ఎమ్మెల్యేగా తనకు చేతనైన సాయం చేస్తాడు అని ఆర్థర్ గురించి చెప్పుకుంటారు. వయసు లో నేను చాలా చిన్న అయినా నన్ను ‘అన్నా’ అనే పలకరిస్తారు. నాకు నందికొట్కూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో బంధువులున్నారు.

స్థానిక రాజకీయాల రీత్యా కొందరు టీడీపీ లోనూ, మరికొందరు వైసీపీ లోనూ ఉన్నారు.

2021 లో ఒకసారి ఆయన నియోజకవర్గంlలో టీడీపీ కి చెందిన మా బంధువుకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో గుండె ఆపరేషన్ జరిగింది. 3 లక్షలు పైగానే ఖర్చు అయింది. నేను అర్థర్ గారికి కాల్ చేసి ఉన్న విషయం చెప్పి CMRF ఇప్పించమని కోరాను. అందుకు ఆయన ‘ఏ పార్టీ అయితేనేం నాకు ఆ డాక్యుమెంట్స్ పంపించున్నా..’ అని చెప్పారు. నెలన్నర లోగా CMRF చెక్ ఇప్పించారు.

నేను పరిశీలించిన విషయం ఏమంటే ఏ కార్యక్రమాలకైనా punctuality పాటించే అరుదైన ఎమ్మెల్యేల్లో ఆర్థర్ ఒకరు.

అసెంబ్లీ సమావేశాలకు ఎన్నడూ గైర్హాజర్ కారు. సరిగ్గా 9 గం. లోపే అసెంబ్లీ లో ఉంటారు. ఖాళీ చూసుకొని సెక్రటరియేట్ కు ఫైల్స్ తీసుకు వెళ్తారు.

ప్రభుత్వ అధికారులపై ఎలాంటి అధికార దర్పం చూపించకుండా హుందాగా వ్యవహరిస్తారు.

నాది నందికొట్కూరు నియోజకవర్గం కాదు. నావల్ల ఆయనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం కూడా లేదు. అయినా నన్ను స్నేహితుడిలా భావించి గౌరవిస్తారు.

ఒకసారి స్నేహం చేశాక ప్రాణప్రదంగా చూసుకుంటారు.

నా వ్యక్తిగత అనుభవాలనే ఉదాహరిస్తాను.

2022 డిసెంబర్ 18 న అర్ధరాత్రి నా భార్య ధనలక్ష్మి గుండె పోటుతో మరణించింది. నా జీవితంలో ఊహించని షాక్ నుంచి కోలుకోలేక నేను ఎవరికీ inform చేయలేదు. మా స్నేహితుల ద్వారా సంగతి తెలుసుకున్న ఆర్థర్ గారు హైదరాబాద్ నుంచి నంద్యాల వచ్చి ఓదార్చారు. సొంత అన్న మాదిరిగా అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఉన్నారు.

ఆయనకు నిరుపేదలకు సాయం చేయాలనే తపన ఎక్కువ.

నేను రాసిన మొట్టమొదటి నవల ‘మేడం.. C’ ఆవిష్కరణ 2023 ఫిబ్రవరి 6 న నంద్యాలలోని రామకృష్ణ పి జీ సెంటర్ లో జరిగింది. నేను స్వయంగా వెళ్ళటం కుదరక, కేవలం ఫోన్ చేసి ఆహ్వానించాను. అయినా నంద్యాల వచ్చి సభకు నిండుదనం తెచ్చారు.

ఆ సందర్బంగా నేను రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డా రామకృష్ణా రెడ్డి గారిని పరిచయం చేశాను.

ఆర్టర్ గారు ఒక నిరుపేద విద్యార్థిని గురించి ఆయన దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన రామకృష్ణా రెడ్డి సార్ ఆ విద్యార్థిని తల్లి దండ్రులకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం పంపించారు.

కరోనా కష్ట కాలంలో స్వయంగా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాడు అని సన్నిహితులు చెబుతారు.

ఆయన ప్రతి ఏటా రక్తదానం చేస్తారు. 66 ఏండ్ల వయసులో కూడా రక్త దానం చేయటం అంటే మానసికంగా, శారీరకంగా ఆయన దృఢత్వం తెలియ జేస్తుంది.

ఎమ్మెల్యే నన్న అహం ఏ కోశానా కనిపించదు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు.

ఇలా చెప్పుకుంటూ పొతే ఆర్థర్ గారి వ్యక్తిత్వం హిమాలయ శిఖరమే.

ఆయన పది కాలాల పాటు ప్రజా జీవితంలోనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.

……..

(అభివృద్ధి కాముకుడు ఆర్థర్… Part 4 లో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top