అన్నమయ్య జిల్లా…
మార్చి 07.2024.
జిల్లా ప్రధాన కార్యాలయం
జిల్లాకు కేంద్ర పోలీసు దళాలు రాక .
రానున్న ఎన్నికల సమయంలో కేంద్ర పోలీసు దళాలు, జిల్లా పోలీసులు సమన్వయంగా పని చేయాలి- అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ బి.క్రిష్ణారావు ఐ.పి.ఎస్ గారు
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర పోలీసు దళo ఎస్.ఎస్.బి కంపెనీ చేరుకున్నది.సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర పోలీసు దళాలు, జిల్లా పోలీసులు సమన్వయంగా పని చేయాలనీ జిల్లా ఎస్పీ శ్రీ బి.క్రిష్ణారావు ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు. కేంద్ర పోలీసు దళాలు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ అధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం లోని పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర పోలీసు దళాలు ,పోలీస్ అధికారులకు, “సార్వత్రిక ఎన్నికల విధులు గురించి” అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర పోలీసు దళాలతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ ,పార్లమెంటు స్థానాలు, పోలీస్ సబ్ డివిజన్లు గురించి విపులంగా తెలియజేశారు. ఎన్నికలు సజువుగా,ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఒక టీం లాగా సమన్వయం చేసుకొని ఎన్నికలు విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి,ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు గురించి అవగాహన కల్పించారు.