యాంటీ డ్రగ్ అవేర్నెస్ ” ప్రోగ్రామ్స్ చేపట్టి విద్యార్థులు, ప్రజల్లో అవగాహన చేయండి
— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
** గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన వివిధ కార్యక్రమాలు, దాడులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలు…
** అవగావనా కార్యక్రమాలు :
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాలు, గ్రామాలలో యాంటి డ్రగ్స్ పై నిన్నటి నుండీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. గంజాయి, తదితర మత్తు పదార్థాలు నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయని, వీటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు. రోగనిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు బాగా దెబ్బతిని చివరకు అకాల మరణాలకు కూడా కారణం అవుతాయని తెలియజేశారు. శరీరంలో ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, లివర్ , ఊపిరితిత్తుల పని తీరు మందగించి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తాయని సూచించారు. రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం, జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, పక్షవాతం రావడం, తదితర దుష్ఫరిణాలు తలెత్తి జీవితమే నాశనమయ్యే ప్రమాదముంటుందని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడితే దేహాన్ని మనకు తెలియకుండానే అవి పీల్చిపిప్పి చేస్తాయి. అంతేకాదు తనపై నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల జోలికెళ్ల రాదని తెలియజేశారు.
** ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలు…
- హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై గడచిన 24 గంటలలో మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 449 కేసులు నమోదు చేశారు. రూ. 90,335/- లు ఫైన్స్ వేశారు
- బహిరంగప్రదేశల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 64 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహన చోదకులపై 13 కేసులు నమోదు చేశారు
- అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు 08 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ. 32,060/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
- ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు అర్దరాత్రి వేళల్లో అనుమానాస్పందంగా సంచరిస్తున్న అపరిచితులు 93 మందిని తనిఖీలు చేసి ముగ్గురిని పోలీసు స్టేషన్లకు తరలించారు
- రాత్రి వేళ ఏటిఎం కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 151 ఏటిఎం సెంటర్లను తనిఖీ చేశారు.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్