దగ్గుపాటి వెంకటేశ్వరావ్ రష్యా టూర్ పై విశ్లేషణ

Analysis on Daggubati Venkateswara Rao's Russia tour

Analysis on Daggubati Venkateswara Rao's Russia tour

Part,1

దగ్గుపాటి వెంకటేశ్వరావ్ రష్యా టూర్ పై విశ్లేషణ

మా మిత్ర బృందంతో రష్యా వచ్చి మూడు రోజులు అయింది. ఈ మూడు రోజుల్లో నా అనుభవం…. రష్యా ప్రజానీకం అసంతృప్తితో ఉన్నా ప్రశాంతత ఉన్నది. అసంతృప్తి ఎందుకంటే సామాన్య ప్రజానీకం యొక్క ఆదాయం తక్కువ, వ్యయం మాత్రం చాలా భారమైపోయింది. యుక్రేన్ తో యుద్ధం ఇష్టం లేకపోయినా …వ్యక్త పరచటం నిషేధం. ఎన్నికల అనేవి కేవలం నామమాత్రం గానే, ఫలితాలు అందరికీ ముందే తెలుసు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇష్టాగ్రామ్ వంటివి నిషేధం. మేము సెయింట్ పీటర్స్ బర్గ్ లో మూడు రోజులు ఉన్నాము. నేను ప్రపంచంలో అనేక దేశాలు, పట్టణాలు చూశాను. కాన్ నా మెప్పును పొందిన సిటీ మాత్రం సెయింట్ పీటర్స్ బర్గ్. బాల్కన్ సముద్రం- నీవా నది కలిసే చోట సెయింట్ ఫిటర్స్ బర్గ్ 1703 వ సంవత్సరంలో పీటర్ ద గ్రేట్ నిర్మాణానికి పూనుకున్నాడు. రష్యా అంటే మామూలుగా మనకి గుర్తుకు వచ్చేది లెనిన్, స్టాలిన్. కానీ ఇక్కడ పీటర్ ద గ్రేట్ కు మొదటి తాంబూలం.. Romano వంశ రాజుల్లో మొదటి చక్రవర్తి 23 సంవత్సరాలు Sweden తోపోరాడి( north war) గెలిచి సెయింట్ పీటర్స్

బర్గ్ ను స్వాధీనం చేసుకొని నిర్మాణం జరిపారు. స్వయంగా మారువేషంలో యూరప్ అంతా తిరిగి science, ఇండస్ట్రీ, పాలన గురించి అవగాహన చేసుకుని నెదర్లాండ్ లో ఒక కార్పెంటర్ గా కూడా పనిచేసి ఓడ నిర్మాణాన్ని నేర్చుకొని వచ్చి రష్యా నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రజలు ఇతని గురించి పీటర్ ది గ్రేట్ అని చెప్పుకుంటారు.

ఇక ప్రస్తుతానికి వద్దాం…….

ప్రశాంత వాతావరణము ఎలాగంటే… 75 లక్షల ప్రజానీకం ఉన్న ఈ సిటీలో ఒక్క పోలీసు కూడా కనపడలేదు. అడిగితే క్రైమ్ లేదు, ఎవరి విధులు వారు నిర్వహిస్తారు… రోడ్డు మీద చెత్త వేసేవారు ఉండరు, చెత్త తీసేవారు కూడాలేరు. విశాలమైన రోడ్లు, కాలువలు, పరిశుభ్రత తో నెంబర్ వన్ సిటీ. ఇంకొక చిత్ర .. ఎక్కడ ఒక్క రాజకీయ నాయకు ని చిత్రం లో poster, flxy కనబడలేదు. ఇంకా ఒక్క advertising hording కనబడలేదు, ఇంకా no motorcycle no auto. Public transport system tram మరియు metro చాలా బాగా పని చేస్తున్నాయి.

ప్రభుత్వ పాలన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే ఉక్రేనియా యుద్ధం గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి రష్యాలో స్థానం ఉండదు. కారణం అడిగితే బలమైనటువంటి ప్రభుత్వం నాయకత్వం దేశానికి అవసరం. ఇష్టారాజ్యంగా ఉండకూడదు. ఆ నియంత్రణ లేకపోతే రష్యాలో విప్లవం వచ్చి ప్రజల జీవన విధానం చిన్నాభిన్నమవుతుందని ప్రభుత్వం అభిప్రాయం. వీరికి చివరి జార్ చక్రవర్తి నికలస్ 2 కు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు ఉదంతాన్ని ఒక అనుభవంగా చెబుతారు. ఇంకొక విషయం ఇప్పుడు రష్యాలో చెబుతున్నటువంటి చరిత్రలో మార్పు కనబడుతుంది. చివరి జార్ చక్రవర్తి గురించి గత చరిత్రలో చాలా క్రూరుడిగా వర్ణన ఉండేది. నేటి పాఠ్యాంశాలలో అది తొలగించి, అతడు శాంత స్వభావుడు సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో పాలనలో పట్టు లేకపోవడంతో రెవల్యూషన్ వచ్చి రష్యా అభివృద్ధి కుంటు పడిందనేది వాదన. ఈ విధంగా పాఠ్యాంశాన్ని మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణతకు ఈ విధంగా వ్రాయబడింది. ప్రభుత్వ సమాచార వ్యవస్థ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండి, పూర్తి నియంత్రణతో ఉండే

విధంగా వ్యవస్థ రూపొందించబడింది.

ప్రపంచంలోని రాజప్రసాదాల్లో ఫ్రెంచి వెర్సైల్స్ ప్యాలెస్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ Hermitage ప్యాలెస్ వెర్సైల్ ప్యాలెస్ ను తలదన్నే విధంగా ఉంది. అలాగే Vatican లో సెయింట్ పీటర్స్ బాసిల్లికా cathdra|గురిచి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అదే స్థాయిలో ఇక్కడ కూడా నెపోలియన్ ని యుద్ధంలో ఓడించిన తర్వాత గుర్తుగా నిర్మించిన St issac cathedral దానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నది. Religion orthodox Christianity. ముస్లింలు ఉన్నా.. ప్రశాంతంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top