ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..అడవి పందులు మృతి

African swinefever Wildboars die

African swinefever Wildboars die

  • నంద్యాల జిల్లా…
  • నల్లమలలో మళ్లీ విజృంభిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..
  • పిట్టల్లా రాలుతున్న అడవి పందులు… రెండేళ్ల కిందట శ్రీశైలం రేంజ్ లో కనిపించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి.
  • అప్రమత్తమైన అటవీ ఉన్నతాధికారులు..
  • ఆత్మకూరు అటవీ డివిజన్ లోని బైర్లూటి రేంజ్ లో ఉన్న నందుల ఈరన్న,జడలయ్య బేస్ క్యాంపుల పరిధిలో కుప్పలు తె ప్పలుగా చచ్చి పడివున్న అడవిపందులు
  • బైర్లూటి ఎఫ్ఆర్ఓ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో చనిపోయిన అడవి పందులకుపోస్టుమార్టం..
  • ప్రాథమికంగా కనిపించిన లక్షణాలను బట్టి ఆఫ్రికన్ సైన్ ఫీవర్ వల్లే పందులు చనిపోతున్నాయని నిర్ధారణకు వచ్చిన వన్యప్రాణివైద్యులు..
  • ఎన్ఎస్ టిఆర్ లో వ్యాప్తిచెందిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అదుపులోకి రాకపోతే వైల్డ్ లైఫ్ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం..

అడవి పందుల పాలిట మృత్యువుగా చెప్పుకునే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నల్లములలో తిరిగి విజృంభిస్తోంది. నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలోని బైర్లూటి రేంజి లోని ముష్టపల్లె , పెద్దనంతాపురం సెక్షన్లో నందుల ఈరన్న, జడలయ్య బేస్ క్యాంప్ పరిధిలో వారం రోజులుగా అడవి పందులు మృత్యువాత పడు తున్నాయి. బైర్లూటి ఎఫ్ఆర్ కృష్ణ ప్రసాద్ చనిపో యిన కొన్ని అడవి పందులకు పోస్టుమార్టం చేయించి పరీక్షల కోసం సంబంధిత ల్యాబ్ కు పంపించారు. ప్రాథమికంగా కనిపించిన లక్షణాలను బట్టి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తోనే మరణించినట్లు భావిస్తున్నారు. రెం దేళ్ల కిందట శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలో అడవి పం దులు, ముఖ్యంగా పిల్లలు కుప్పలుతెప్పలుగా మర ణించాయి. అప్పట్లో కూడా మరణాలకు ఆఫ్రికన్ స్వైప్ ఫీవరే కారణమని గుర్తించారు. ఆ సందర్భంగా దీన్ని వైల్డ్ లైఫ్ మెడికల్ ఎమర్జెన్సీగా ప్రభుత్వం గుర్తించింది.

నంద్యాలలో పందుల మరణాలు : జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ఓ వ్యక్తికి చెం దిన పందుల ఫారంలోని 40 పందుల్లో 30 ఇటీవల హఠాత్తుగా మరణించినట్లు తెలుస్తోంది. ఇవి ఆఫ్రి కన్ స్వైన్ ఫీవర్ వల్లే చనిపోయాయా అన్న అను మానంతో అటవీ అధికారులు పరిశీలన జరుపు తున్నారు. ఆత్మకూరు, వెలుగోడు పట్టణాల పరిదిలోని గ్రామాల్లో పందుల పెంపకందారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు..

వైరస్ నల్లమలకు చేరిందిలా ; పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) వైరస్కు కారణం శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలోని పెంపుడు పందుల ఫారాలేనని గతంలో తేలింది. బెంగళూరు తదితర నగరాల నుంచి పెంపకానికి తీసుకొచ్చిన సీమ పందులలో ఉన్న ఏఎస్ఎఫ్ వైరస్ వారి పారాలలో ఉన్న ఊర పందులకు సోకినట్లు తెలుస్తోంది. అవి అడవిలో మేతకు వెళ్లినపుడు అరవిసం దులకు వ్యాప్తి చెందినట్లు వన్యప్రాణి వైద్యులు చెబు తున్నారు. ఈ వైరస్ సోకిన పందులు అంతర్గత రక్త స్రావంతో (ఇంటర్నల్ బ్లీడింగ్) కూడిన జ్వరంతో అతి వేగంగా మరణానికి చేదువవుతాయి. ఇది మను షులకు, ఇతర వన్యప్రాణులకు సంక్రమించదని సమాచారం. ఈ పీవర్కు నేరుగా చికిత్స లేక. పోయినా, వైరస్ విస్తరించకుండా శానిటేషన్ చేయిం చడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది.

అన్ని చర్యలు తీసుకుంటున్నాం – విగ్నేష్ పావ్, డిడి, ప్రాజెక్ట్ టైగర్, NSTR

బైర్లూటి రేంజ్ లో అడవి పందులు మరణించిన సంగతి తెలియగానే ఫుట్ పెట్రోలింగ్ను పెంచాం. మరణాల సంఖ్య పెరుగుతుందేమోనన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం. ప్రాథమిక ఆంచనా మేరకు వీటి మరణానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవరే కారణంగా భావిస్తున్నాం. ఇది అడవిలో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా శానిటేషన్. చేపడుతున్నామని డి ఎఫ్ ఓ విగ్నేష్ పావ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top