అత్యాచారం కేసులో నిందితుడికి 1౦ సం.ల కారాగార శిక్ష, రూ.11,000/- జరిమానా..
ఏలూరుజిల్లా జీలుగుమిల్లి పోలీసు స్టేషనులో 2021లో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడైన బుట్టాయగూడెం మండలం సూరప్పగుడె౦ గ్రామానికి చెందిన కోసూరి అంజి ప్రసాద్ తండ్రి సాంబశివరావు @ సాంబయ్య అనే అతనికి ఏలూరు మహిళా కోర్టు 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణ 10 సం.లు కారాగార శిక్ష, రూ.10,000/-లు జరిమానా విధిస్తూ ఈరోజు ( గురువారం) సాయంత్రం తీర్పు వెల్లడించారని ఆ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు.
ఈకేసు వివరాలు ఇలా ఉన్నాయి…..
బుట్టాయగూడెం మండలం సూరప్పగుడె౦ గ్రామానికి చెందిన కోసూరి అంజి ప్రసాద్ తండ్రి సాంబశివరావు @ సాంబయ్య అనే వ్యక్తి కి జీలుగుమిల్లి మండలం రాచన్నగుడె౦ గ్రామానికి ు చెందిన ఒక ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. అతడు ఆమెకు వరసకు మామయ్య అవుతాడు. ఒకరోజు ఆమెను అతని ఇంటికి తీసుకెళ్ళిగా తన తల్లిదండ్రులు కోసూరి రామలక్ష్మి, కోసూరి సాంబశివరావు లు వారికి బాగా నచ్చిందని, వారి కొడుకు అంజి ప్రసాద్ తో వివాహం చేస్తామని, ఆమెను చదువు మానివేయమని, అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారే కూతురు లా భావించి పెళ్ళి చేసి బాగా చూసుకుంటామన్నారు.
తరువాత ఆమెను సాంబశివరావు తన బండిపై వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దించాడు. సదరు విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. ఆగస్టు 5 న అమ్మాయి తల్లిదండ్రులు వారి బంధువులను తీసుకుని సూరప్పవారి గుడె౦ కోసూరి అంజి ప్రసాద్ ఇంటికి వెళ్ళి వారి వివాహం, కట్నకానుకలు గురించి మాట్లాడుకున్నారు. తరువాత అంజి ప్రసాద్ ఆమె ఇంటికి వచ్చి వెళ్తూ ఉండే వాడు. ఆమె ఇసష్టానికి వ్యతిరేకంగా శారీరకంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినాడు.
తరువాత ఆమెను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించి మోసం చేసినాడు. ఆమె తల్లిదండ్రులు ద్వారా పెద్దల్లో పెట్టి అడిగించినా ఒప్పుకోలేదు. అతని తల్లిదండ్రులు ఎక్కువ కట్నం ఇచ్చే ఆమెతో తన కొడుకుకు పెళ్ళి చేస్తామని దుర్బషలాడుతూ ఆమెను వెళ్ళగొట్టారు. దానిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో జీలుగుమిల్లి పోలీసు స్టేషనులో ది.20-04-2021న అప్పటి ఎస్ఐ.K. విశ్వనాథ బాబు కేసు నమోదు చేయగా, అప్పటి పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.ఎన్.ఎన్.మూర్తి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, సాక్షులను విచారించి పూర్తి దర్యాప్తు రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు.
ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టడానికి జీలుగుమిల్లి ఎస్.ఐ నరేష్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ పరమేష్ ,కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ కే.ఎస్.ఎన్ మూర్తి సహకరించారు. కోర్టులో బాధితురాలు ఆమె తరపున సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి. రామాంజనేయులు ప్రవేశ పెట్టి వాదనలను త్వరతగతిన పూర్తి చేసి నిందితులకు శిక్షపడే విధంగా చర్యలు చేపట్టారు. నిందితుడు కోసూరి అంజి ప్రసాద్ ఆమెపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో ఏలూరు మహిళా కోర్టు 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.మురళీకృష్ణ 10సం.లు కారాగార శిక్ష, మరియు రూ.10,000/-లు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు.
#Accused sentenced to 10 years in prison in rape case