రష్యా గురించి..దగ్గుపాటి వెంకటేశ్వరరావు

About Russia..Daggupati Venkateswara Rao

About Russia..Daggupati Venkateswara Rao

Part – 2

రష్యా గురించి మరికొంత సమాచారం…(దగ్గుపాటి వెంకటేశ్వరరావు)
రష్యాలో ప్రజల ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువైనా కూడా ప్రశాంతంగా ఉన్నారు. నమ్మకంగా ఉన్నారని రాశాను.
ఎందుకు ఈ విధంగా ఉన్నారని విశ్లేషిద్దాం…
నేను 40 సంవత్సరాల క్రితం రష్యా వచ్చాను. కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు తెలుగు యువత అధ్యక్షునిగా ప్రపంచ యువజనోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చాను. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. గోర్బచెవ్ అధ్యక్షుడు.
మాస్కోలో అనేక ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద క్యూలు కనపడ్డాయి. “ఎందుకు?” అని అడగ్గా.. మన రేషన్ షాపుల్లో నిత్యవసర వస్తువులు తెచ్చుకునే విధంగా రొట్టె ముక్కలు పంచుతున్నారు.
ప్రజలను పలకరిస్తే, ప్రభుత్వం మీద చాలా అసంతృప్తిగా ఉండి సాయంత్రానికి వోడ్కా తాగి ప్రభుత్వాన్ని తిడుతూ కనిపించేవారు. ఇది కమ్యూనిస్టు పాలనలో జరిగింది.

పర్యవసానం

1991లో సంస్కరణలు పెరెస్ట్రోయికా, గ్లాస్ నోస్తూ అని కుప్పకూలినది కమ్యూనిస్టు ప్రభుత్వం.
కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం, కార్మిక నియంతృత్వ ప్రభుత్వం, వనరులు అందరికీ సమానంగా పంచుకోవడం వంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కన పెట్టి, కమ్యూనిస్టు ప్రభుత్వం తన సంపాదనంతా ప్రపంచ దేశాలలో పార్టీ ప్రచారానికి, ఆయుధ ఉత్పత్తికి వినియోగించింది. ప్రజలకు ఒరిగిందేమీ లేదు. శ్రమ పెరిగి ప్రజలకు ప్రయోజనం కలగలేదు.
ఈ అనుభవం నేటికి గుర్తు ఉండటం నేను పైన చెప్పిన నమృత, ప్రశాంతతకి ఒక కారణం. మళ్లీ కమ్యూనిజం వద్దు అని వాళ్ల భావన అనేది వాళ్ళ అభిప్రాయం. లెనిన్ ప్రతిమలనేకం తొలిగించటం ఒక నిదర్శనం…

రెండో కారణం:

1991లో ఎల్సిన్ అధ్యక్షుడు అయినప్పుడు కమ్యూనిస్టులుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు పరిచినప్పుడు, ఆ ప్రజాస్వామ్యంలో అదుపు-ఆపు లేకుండా, ఇష్టం వచ్చిన రీతిలో అధికారం కొంతమంది చేతుల్లోకి తీసుకొని, వారు మాత్రమే బాగుపడి ధనవంతులై మిగిలిన దేశ ప్రజానీకం అంతా దిక్కు దివాణం లేని అనిశ్చిత వాతావరణంలోకి తోయబడి, చివరకు స్త్రీలు వ్యభిచారులుగా మారి ఆదాయం సంపాదించాల్సిన పరిస్థితిని అనుభవించారు.
మాస్కోలో ప్రతి రెండు మూడు కిలో మీటర్ల కి casino ఉండేది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఫెయిల్ అయిన స్థితి అది….

రష్యా జార్ చక్రవర్తుల సమయంలోను, ఆ తర్వాత అమెరికాతో సమాంతరంగా ఉన్న దేశంగా ఉండి గర్వపడేలా ఉండేది. ఆ స్థితి పోయి అడుక్కునే స్థితికి వచ్చేసింది ఎల్సి న్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. అప్పటి అనుభవంతో తమ దేశం పరువు ప్రతిష్టలు కొనసాగాలంటే, ఒక బలమైన నాయకత్వం ఎంతైనా అవసరమని నేటి ప్రజల అభిప్రాయం. “పుతిన్” రష్యా అధ్యక్షుడిగా, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన కొనసాగించగా, ఈరోజు రష్యా ప్రపంచ దేశాలలో ఒక బలమైన దేశంగా మళ్లీ గురింపు పొందింది. నేటి ప్రజలు ఇది అర్థం చేసుకొని బలవంతుడెన తమ నాయకుని ఆజ్ఞలను పాటించడం తమ ప్రథమ కర్తవ్యంగా భావించి, ఆదాయ వనరులు తక్కువగా ఉన్నా తమ నాయకుడికి అండగా ఉన్నారన్నది . No doubt 99% loves him… రొట్టె ముక్కలతో సరిపుచ్చిన కమ్యూనిజం, ఇటు అదుపు ఆజ్ఞలు లేని ప్రజాస్వామ్యం రెండిటికి విముఖులైన రష్యా ప్రజలు ఉన్నారు.

నా గమనిక లో మరికొన్ని వివరాలు:

విద్య. :

విద్యను అభ్యసించేందుకు ఉచితంగా పాఠశాలలు, కాలేజీలు, విశ్వ విద్యాలయాలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి ఫీజులు అధికం.. 90 శాతం ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందిస్తుంది. మిగతా పది శాతం ప్రైవేట్ విద్య ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఉన్నత విద్య చదవాలంటే అందరూ కచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ వ్రాయాలి. అందులో మెరిట్ సాధించిన విద్యార్థులే అర్హులవుతారు. అంతేకానీ పాస్ మార్కులు సాధించిన వారందరూ కూడా ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు వెళ్లే అవకాశం లేదు. ఇక్కడ మెరిట్ ను బట్టి ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు లేవు.

వైద్యం:

వైద్యం కూడా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. అయితే వెయిటింగ్ ఉంటుంది. ప్రైవేట్ వైద్యం కూడా ఉంది. ప్రత్యేక సౌకర్యాలు కోరుకునే వారు మాత్రం ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది.

ఉద్యోగం :

సామాన్యంగా సిటీలో 50 నుండి 60 వేల రూబల్స్ జీతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 20% శాతం తక్కువ. ఉంటుంది. పెన్షన్ 20 నుండి 30 వేల వరకు ఉండగా, రోజువారీ కూలీలుగా చేసేవారు తక్కువ. ఎక్కడన్నా ఉన్నా గంటకు 200 ఇస్తారు. ఉచిత రేషన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే నిరుపేదలకు 5వేల రూబుల్స్ దాకా నెలకు ఇచ్చే వసతి కలదు.
అలాగే చిన్నపిల్లలు ఉండి, ఆధారం లేని కుటుంబాల వారికి సహాయం ఉంటుంది. వితంతువు లకు కూడా సహయం ఉంటుంది

కుటుంబ నియంత్రణ. :

ఎక్కువమంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనే వారికి ఐదు, ఆరు, లక్షల రూబల్స్ వరకు సహాయం. ఉంటుంది ధన రూపంలో ఇవ్వకుండా ఇల్లు ఏర్పాటు లాంటివి చేసుకోవాలి.

మెట్రో.:

మాస్కోలో మేము చూసిన మెట్రో ఒక అద్భుతం. రష్యాలో పర్యటించిన వారందరికీ ఇది తెలిసిందే. అయితే గమనించవలసింది ఏమిటంటే జార్ చక్రవర్తులు ప్యాలెస్ లను తమ కోసం నిర్మించుకుంటే, తరువాత వచ్చిన పాలకులు సామాన్య జనాల కోసం ఈ మెట్రో స్టేషన్లను పాలరాతి ప్యాలెస్ లుగా నిర్మించారు. ప్రతి నిమిషానికి ఒక ట్రైన్ వెళుతూ దాదాపు 350 కిలోమీటర్ల రూటు నిర్మాణం చేయబడింది. ప్రతి స్టేషన్ కు ఒక విశిష్టత ఉంది. చరిత్రలోని అంశాలైనటువంటి జార్ చక్రవర్తుల విశేషాలతో పాటు, రష్యా విప్లవ అంశాలు, సోవియాట్ యూనియన్ లో ఆనాడు ఉన్నటువంటి కథనాలు ఒక్కొక్క స్టేషన్కు ఒక్కొక్క దేశాన్ని ప్రతిబింబంచేలా నిర్మాణం చేశారు.
ఇంకా జార్జ్ చక్రవర్తుల నాటి భవనాలు,వారు ఉపయోగించిన వస్తువులు, డ్రస్సులు, కిరీటాలు, నగలు, అనేక దేశాల వారు బహుమతులుగా ఇచ్చినటువంటి వస్తువులును మ్యూజియం లాగా ఉంచారు. ఇవన్నీ 1917 అక్టోబరు బోల్ష్విక్కు విప్లవం తరువాత … యాత్రికులు రష్యాలో పర్యటించే సందర్భంలో వీక్షించటానికి పర్యాటక అభివృద్ధికి తోడ్ప డే విధంగా వీటన్నిటిని ధ్వంసం చేయకుండా భద్రపరచినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం తప్పకుండా అభినందనీయం.

పన్ను విధానం : 15 లక్షల వరకు ఆదాయానికి 6%. అయితే 24 లక్షల వరకు 13%, పైకి పోయే కొద్దీ
పెరుగుతూ ఐదు కోట్ల స్థాయికి వచ్చినప్పుడు 22%. అదే కార్పొరేట్ టాక్స్ అయితే మరొక 5% ఎక్కువ.

ఇంటెలిజెన్స్ వ్యవస్థ :

పాలనలో ముఖ్యమైనటువంటిది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పాలనలో తగు నిర్ణయాలు చేయడానికి సహకరిస్తుంది. పోలీస్ కనబడకపోయినా, నిఘానేత్రం, సీసీ కెమెరాలు అంతటా ఉంటాయి. సమాచారం అందుబాటులో కచ్చితంగా ఉండి, వెంటనే చర్య తీసుకునే వ్యవస్థ ఉంది.

అవినీతి : అవినీతి ఉంది. మోతాదు సమతూకంగా ఉంది అని నా అభిప్రాయం.

రష్యా విస్తీర్ణానికి వస్తే.. అమెరికా కంటే మూడింతలు పెద్దది. తూర్పు నుండి పడమరకు పదివేల కిలోమీటర్లు పైచిలుకు, ఉత్తరం నుండే దక్షిణం వరకు 4 వేల కిలోమీటర్లు పైచిలుకు ఉంటుంది. Time జోన్ కూడా మారుతూ ఉంటాయి. రాత్రి 11 గంటలకు కూడా వెలుతురు ఉండి శీతాకాలంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. రష్యాలో తయారయ్యే కార్లలో లాడా company కార్లు ప్రసిద్ధి చెందినవి. సగటున కారు 5 లక్షల నుండి 10 లక్షల రూబల్స్ ఉంటుంది. (ఒక రూబుల్ కి రూపాయి రెండు పైసలు) రష్యాలో 50% కార్లు లాడా తయారీవి అయితే మిగిలినవి ఎక్కువగా చైనావి ఉంటాయి. గృహ పరికరాలు, ఇతర వస్తువులు అధిక శాతం చైనావే వాడుతారు. తక్కువ ధర కాబట్టి. రష్యా బ్రాండ్ అయినా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రజలు నేరుగా యూరోప్ దేశాలకు వెళ్లడం నిషేధం. విమాన సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు మాత్రం పుతిన్ కే మద్దతు. యుద్ధ సమయంలో సైన్యములో చేరి యుద్ధ భూమికి వెళ్లడానికి ప్రజలు సుముఖత చూపుతారు. సైన్యంలో చేరే వారికి రెండు నుండి మూడు రెట్లు జీతం అధికం.

మా పర్యటనల్లో భాగంగా లెనిన్ ముసోలియం
కూడా ఉంది. నేటికి కచ్చితంగా 100 సంవత్సరాలు దాటింది. 1924 లో లెనిన్ చనిపోయారు. నేను 40 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏ విధంగా లెనిన్ దేహం ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. సంవత్సరంలో ఒక మాసం మాత్రం మూసివేసి దేహం చెడిపోకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటారు. స్టాలిన్ దేహం కూడా మొదట ఇక్కడే ఉంచారు. కానీ తర్వాత అధ్యక్షుడైన కృచేవ్ స్టాలిన్ దేహాన్ని తొలగించి మిగిలిన వారితో సమానంగా ఖననం చేశారు. ఇక్కడకొచ్చిన ప్రజలు మాత్రం స్టాలిన్ సమాధిని కూడా దర్శించుకుని నివాళులు అర్పిస్తారు.

ఇంతటితో మా మాస్కో పర్యటన ముగిసింది..

#About Russia..Daggupati Venkateswara Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top