పోలవరం ప్రాజెక్టుపై CM చంద్రబాబును ప్రశ్నించిన ఓ మహిళ

A woman questioned CM Chandrababu on the Polavaram project

A woman questioned CM Chandrababu on the Polavaram project

పోలవరం పూర్తి పై బాబు గారు ఫుల్ క్లారిటీ తో వున్నారా..?

పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేదేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబును ప్రశ్నించిన సామాన్యురాలు..https://www.youtube.com/watch?v=YbNgzgF0JU4

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతుండగా ఓక మహిళ లేచి పోలవరం గురించి శ్వేత పత్రం విడుదల చేసిన మీరు .. ఎప్పుడు పూర్తి చేస్తారో శ్వేత పత్రంలో తెలియజేయలేదని ప్రశ్నించింది. దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరణాత్మక మైన జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏపి ప్రజలు తెలుసుకోవాలని, చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను బాబు మెచ్చుకున్నారు.

రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాల్సిన విషయమంటూ చంద్రబాబు వివరణాత్మక జవాబు..

పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణ ఇస్తూ.. ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో, నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటి వరకు 70 వేల కోట్లుగా నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకే అర్థం కావడంలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు రెండు సీజన్లలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డయాఫ్రాం వాల్ నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత స్పిల్ వే కట్టామని, కాఫర్ డ్యాంలు కూడా పూర్తిచేశామని వివరించారు.

నేను ఓడిపోవడం తోనే డయాఫ్రాం వాల్ నిర్మించలేక పోయాం

మే లో ఓడిపోవడంతో డయాఫ్రాం వాల్ పూర్తిచేయలేకపోయామని, ఈ లోపు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి కాంట్రాక్టర్ ను మార్చేశారని వివరించారు. రెండేళ్లు ప్రాజెక్టును వదిలేయడంతో వరదలకు డయాఫ్రాం వాల్ దెబ్బతిందని చెప్పారు. కాఫర్ డ్యాంలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో ఏంచేయాలనేదానిపై అమెరికా, కెనడా ఇంజనీర్లను రప్పించి, వారితో చర్చిస్తున్నామని తెలిపారు.

Read This

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top