తేదీ:22/02/2024
జగిత్యాల భూ పోరాటంలో అరెస్టు అయి జైలు నుండి విడుదల అయినా నాయకులకు సిపిఎం ఘన స్వాగతం
పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాటం ఆగదు..
-CPM తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ..
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ భూమిలో వందలాది ఎకరాలలో సుమారుగా 15 వేల మంది పేదలతో,భూ పోరాటం చేసిన నాయకులు లెల్లల బాలక్రిష్ణ, తిరుపతి నాయక్,, రజియా సుల్తానాలు గత 38 రోజులుగా కరీంనగర్ జైల్లో ఉన్నారు. నేడు విడుదల అయిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర,కరీంనగర్ జిల్లా నాయకత్వం పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.వి.రమణ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి లు మాట్లాడుతూ పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకుల, పేదలపై అక్రమ కేసులు పెట్టి 38 రోజులుగా జైల్లో నిర్బంధించారని అన్నారు.
అక్రమ కేసులు,బెదిరింపులు ఉద్యమాలను ఆపలేవని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేంతవరకు సిపిఎం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. 38 రోజులుగా జైల్లో ఉండి,పేదల కోసం పోరాటం చేసి విడుదలైన లెల్లల బాలక్రిష్ణ, తిరుపతి నాయక్, రజియా సుల్తానా కు పూలా మాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను వదిలేసి, పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న వారిని ప్రభుత్వం నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు కక్షపూరితంగా ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవానే కుట్రతో పేదలపై అక్రమ కేసులు పెడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన పేదలందరికీ భూములు పంచాలని డిమాండ్ చేశారు.
లేదంటే అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించి పేదలకు ఇండ్ల స్థలాలు దక్కింతవరకు పోరాడుతామని అన్నారు.
పేదల తరఫున కేసు వాదించి, బెయిల్ ఇప్పించిన వకీల్ బీమాసాహెబ్ కి ప్రజా సంఘాల తరఫున అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్,గోరెంకల నర్సింహ్మ కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి,గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్ నాయకులు లెల్లల భవాని, కొప్పు పద్మ,జి.రమేష్, చంద్రయ్య , వెంకట చారి, రఫిక్, వినోద్, గజ్జల శ్రీకాంత్,నవీన్, గణేష్ లతో పాటు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
అభినందనలతో…
డి.నరేష్ పటేల్. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు.