”ఉచితబస్సుపై ‘RTC

RTC on 'free bus'

RTC on 'free bus'

ఉచితబస్సు అనగానే, చీరకూడా సరిగ్గా సర్దుకోకుండా ఎగేసుకుంటూ..వస్తున్నారా అంటూ RTC సిబ్బంధి మహిళలన హేళన చేయడం పరిపాటిగా మారింది. నంద్యాలజిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో సిబ్బంది బరితెగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం వెళ్లేందుకు బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉచిత బస్సు ప్రయాణం కదా అని మహిళలను తక్కువ చేసి చూస్తూ, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.​’ ఉచితం అనగానే ఏగేసుకొని రావడం కాదు’ అంటూ ప్రయాణికురాళ్లపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు సదరు ఉద్యోగులు. ఐతే ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లేందుక ఇదే చివరి బస్సు కావడంతో, గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆరాటంతో ఆ అవమానాన్ని భరిస్తూనే మహిళలు ప్రయాణం కొనసాగించారు.

ఐతే ఆత్మకూరు డిపోలో ఆడవాళ్లను అవమానించడం ఇదేమి కొత్త కాదు, మొన్నఈమధ్యనే ఆదోని డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆడవాళ్ళ ముందే, ఈ ఉద్యోగం నావెంట్రుక, నాబొచ్చు అని కింద పైన చేతులు చూయిస్తూ అసభ్య పదజాలంతో ఆడవాళ్ళపై విరుచుక పడ్డాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని హేళన చేస్తూ, సామాన్య ప్రయాణికులను మానసిక క్షోభకు గురిచేస్తున్న ఈ సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మహిళలను బస్టాండు సాక్షిగా అవమానించిన సదరు ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ విపరీతంగా ఉందని.. దానికి తగ్గట్లుగా బస్సుల సంఖ్యను వెంటనే పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top