ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీ విద్యార్థిని విద్యార్థినులకు యాంటీ ర్యాగింగ్ & సైబర్ నేరాలపై మరియు పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్, క్రైమ్ అగ్నిస్ట్ విమెన్ కేసులను గురించి శక్తి యాప్ను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినారు
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్య చంద్రరావు గారు సి ఆర్ రెడ్డి కాలేజీ విద్యార్థిని విద్యార్థినులకు యాంటీ ర్యాగింగ్ & సైబర్ నేరాలపై మరియు పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్, క్రైమ్ అగ్నిస్ట్ విమెన్ కేసులను గురించి శక్తి యాప్ను గురించినా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ గారు మాట్లాడుతూ
ర్యాగింగ్ వల్ల మనోవేదన, ఆత్మహత్యల వరకు దారితీసే ప్రమాదం ఉందని, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేలా చదువుపై దృష్టిపెట్టాలన్నారు.
సైబర్ నేరాలపై చైతన్యం కల్పిస్తూ, ఆయన వివరించిన ముఖ్య అంశాలు:
ఫేక్ జాబ్ ఆఫర్లు, లోన్ యాప్‌లు, డిస్కౌంట్ స్కామ్‌లు, ఏటీఎం కార్డ్ క్లోనింగ్, ఫేస్‌బుక్ వేధింపులు, ఫోన్ నంబర్ల దుర్వినియోగం
పోక్సో యాక్ట్ & గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన
వ్యక్తిగత సమాచారం/ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, ఇంటర్నెట్‌ను సమాచార సాధనంగా మాత్రమే వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు గారు, మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి గారు శక్తి టీం సభ్యులు సి ఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకుల అధికారులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.