CM రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ – MP బైరెడ్డి శబరి

IMG-20250417-WA0054.jpg

CM relief fund checks distribution by MP Byreddy Shabari

  • పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా
  • ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా నిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

గురువారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కర్నూలు కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ భాదితులకు వెంటనే మంజూరు చేసి దైర్యం అందిస్తూ, ఆర్ధిక భరోసా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధిక కష్టాలు ఉన్నా పేద రోగులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ముందుంటున్నారని ఎంపీ శబరి అన్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడుకు చెందిన బాధితుడు గటిక రాంప్రసాద్ రెడ్డికి రూ. 2,15,300 లక్షలు, పాణ్యం నియోజకవర్గం లక్ష్మిపురంపేటకు చెందిన పి. సాయి ప్రియకు రూ. 56,273 వేలు, ఆళ్లగడ్డ కు చెందిన పి. చిన్న దస్తగిరికి రూ. 79,502 వేలు, బనగానపల్లెకు చెందిన కె. జయంతి కి రూ. 23,400 వేలు, కొత్తపల్లికి చెందిన గజ్జల వెంకట లక్ష్మి కి రూ. 50,431 వేలు, కానాలకు చెందిన ముక్కు తిరుపతిరెడ్డి కి రూ. 81,000 వేలు, బండి ఆత్మకూరు కు చెందిన పిట్టం వెంకట సుబ్బమ్మ కు రూ. 75,090 వేలు, నంద్యాల బొమ్మలసత్రం కు చెందిన సోమ జయమ్మ కు రూ. 25,227 వేలు, కర్నూలు వద్ద దొర్నిపాడుకు చెందిన జి. నాగేంద్ర కు రూ. 30,000 వేలు ఇలా మొత్తం రూ.6,36,223 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భాధితులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. తన లెటర్ ద్వారా పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు వెంటనే విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top