ఉద్యమం..అణచివేత పోలీసుల సక్సెస్
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని సిద్ధపల్లి గ్రామస్తులు.. పూర్వం నుండి నడిచే తమ దారిని నేషనల్ హైవే 340’C మూసి వేస్తుండటంతో..
శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా.. తమ హక్కులను కాపాడుకునేందుకు నిరాహార దీక్ష చేయడానికి నేషనల్ హైవే 340’C పై శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో… ఆత్మకూరు పోలీసులు వారి ఆశలపై నీళ్లు చల్లి.. ఆ ఉద్యమాన్ని ఆదిలోనే అంత మొందించారు.
మీరు..మీ హక్కును కాపాడుకోవాలంటే వేరే దారి చూసుకోవాలని.. ఇక్కడ నిరసన చేయొద్దని హెచ్చరించారు.
పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. కేసులు బనాయించి రిమాండ్ కు పంపుతామని బాహాటంగా హెచ్చరించారు.
సిద్దపల్లె గ్రామస్తులు చేసేదేమి లేక శిబిరాన్ని తొలగించి దిక్కుతోచని స్థితిలో.. తమ ఆర్తనాదాలు ఇంకెవ్వరికి వినిపించాలన్న అయోమయంలో వెనుదిరిగి వెళ్ళిపోయారు.
రాజ్యాంగం కల్పించిన ఈజ్ మెంట్ యాక్ట్ 1882 ప్రకారం తమ హక్కులను కాపాడుకునేందుకు సిద్ధమైన సిద్ధపల్లె గ్రామస్తుల ఆశయాన్ని నిర్వీర్యం చేస్తూ..ఉద్యమాన్ని అణచి వేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.