సముద్రంలో ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్ బోటు

A speedboat collided with a ferry at sea

A speedboat collided with a ferry at sea

ముంబైకి సమీపంగా అరేబియా సముద్రంలో జరిగిన పడవ ప్రమాద లైవ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీని స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో .. 13 మంది మృతి

ముంబై బోట్ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. మృతుల్లో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారని, 101 మందిని కాపాడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీ బోట్ను నేవీకి చెందిన స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

పడవ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం

ముంబై పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ₹2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఇవ్వనున్నట్లు PMO తెలిపింది. ఫెర్రీ బోట్ను నేవీ స్పీడ్ బోటు వేగంగా ఢీకొట్టడంతో 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top