శింగనమల సీఐ కౌలుట్లయ్యని పనితీరును అభినందించిన ప్రజా సంఘాల నాయకులు
సీఐని సన్మానించిన తరిమెల జైభీమ్ రామాంజనేయులు
శింగనమల,అనంతపురం జిల్లా :
భారతీయ భీమ్ సేన సంఘం మరియు పలు ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో శింగనమల సీఐ కౌలుట్లయ్యని మర్యాద పూర్వకంగా కలిసి అభినందించినట్లు తరిమెల జై భీమ్ రామాంజనేయులు తెలియజేశారు.సీఐ కౌలుట్లయ్యను శాలువాతో సత్కరించి పూలహారంతో సన్మానించినట్లు తెలిపారు.ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటాన్ని అందించామనీ తెలియజేశారు.ఈసందర్బంగా జై భీమ్ రామాంజనేయులు మాట్లాడుతూ శింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య వచ్చినప్పటి నుంచి శింగనమల, నార్పల,గార్లదిన్నె మండలాలో శాంతిభద్రతలు ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలియజేశారు.
ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు సైబర్ నేరాలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.ప్రమాదాలు నివారించడానికి ప్రతిరోజు వాహన తనీఖీలు నిర్వహించడంతో పాటు డ్రైవర్లకు మెళుకవలు తెలియజేస్తూ సమావేశాలు నిర్వహించడం చాలా ఉపయోగకరమని తెలియజేశారు. అసాంఘిక కార్యకలాలపాలపై ఉక్కు పాదం మోపి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.గ్రామాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల పాత్ర తెలియజేస్తూ ముందుకు వెలుతున్నారని ఆయన సీఐని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు పామిడి సాకే ఓబులేష్ ,డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు హెచ్ కే నాగరాజు,బిబియస్ నియోజవర్గ నాయకులు కనంపల్లి రమేష్ ,కల్లూరు సురేష్ బాబు,పామిడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు