విద్యాశాఖపై మంత్రి నారాలోకేష్

Minister Naralokesh on Education

Minister Naralokesh on Education

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మోడ‌ల్ ఫ‌లితమే ఈ జాతీయ అవార్డు -మంత్రి నారాలోకేష్

  • విద్యాశాఖ‌, స‌మ‌గ్ర‌శిక్షా, ఇంక్లూజివ్ ఎడ్యుకేష‌న్ కృషికి త‌గిన గుర్తింపు ల‌భించింది
  • రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డు అందుకోవ‌డం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం
  • అభినంద‌న‌లు తెలిపిన మాన‌వ‌వ‌న‌రులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

విద్యావ్య‌వ‌స్థ‌లో దేశానికే దిక్సూచిలా నిలిచే ఆంధ్ర మోడ‌ల్ స‌త్ఫ‌లితాల‌కు ఈ జాతీయ అవార్డు నాంది ప‌లికింద‌ని మాన‌వ‌వ‌న‌రులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్ర‌క‌ట‌న‌లో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ & దివ్యాంగ సాధికారత విభాగం (దివ్యాంగ జన్) ఆధ్వర్యంలో జరిగిన ‘నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2024’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అవార్డును సాధించడం ప‌ట్ల మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. విద్యాశాఖ, సమగ్ర శిక్షా దిశానిర్దేశంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేష‌న్ విభాగం చేసిన కృషికి త‌గిన గుర్తింపు లభించిందని ప్రశంసించారు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top