రాయలసీమను ఆదుకోండి – బొజ్జా దశరథరామిరెడ్డి

Support Rayalaseema Bojja Dasaratharamireddy

Support Rayalaseema Bojja Dasaratharamireddy

ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని ప్రొద్దుటూరు లోని వారి స్వగృహంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, సభ్యులు భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పుస్తక రూపంలో వరదరాజుల రెడ్డి గారికి అందజేసారు.

శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండలా ఉన్నా 50 రోజులలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు మరియు మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా ప్రాజెక్టుకు 210 టిఎంసీ ల నీటిని తరలించే వెసులుబాటు ఉన్నా కేవలం 80 టిఎంసి ల నీటిని మాత్రమే పొందిన విషయాన్ని బొజ్జా వివరించారు. నీటిని పూర్తి స్థాయిలో తరలించలేక పోవడానికి ప్రాజెక్టుల వారిగా ఉన్న ఇబ్బందులను సవివరంగా వరదరాజులరెడ్డి గారికి బొజ్జా వివరించారు. గత పదేళ్ళలో రాయలసీమ సాగునీటి రంగానికి కేవలం 15 శాతమే బడ్జెట్ కేటాయింపులు కేటాయించడంతో సాగునీటి ప్రాజెక్టులు మరమ్మత్తులకు నోచుకోక శిథిలావస్థకు చేరిన విషయాన్ని వరదరాజల రెడ్డి గారి దృష్టికి బొజ్జా తీసుకొని వచ్చారు. 42 శాతం వ్యవసాయ యోగ్యం భూమి కలిగిన రాయలసీమ ప్రాంతానికి బడ్జెట్ లో 42 శాతం బడ్జెట్ కేటాయింపులు వుండేలా కృషి చేయాలని శాసన సభ్యుడికి బొజ్జా విజ్ఞప్తి చేశారు.

కృష్ణా డెల్టా కు కేటాయించిన హక్కుగా ఉన్న నీటిని వియోగించుకోకుండా, ఆ నీటిని సముద్రంలో పారబోస్తూ దానికి బదులుగా శ్రీశైలం నుండి నీటిని కృష్ణా డెల్టాకు తరలించేలాగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో జూన్ 18 -19, 2015 చేసిన తీర్మానాన్ని వరదరాజరెడ్డి గారి దృష్టికి బొజ్జా తీసుకొని వచ్చారు. దీనితో రాయలసీమ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందనీ, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి రాయలసీమకు న్యాయం చేయాలని బొజ్జా వరదరాజు రెడ్డి గారిని కోరారు. కృష్ణా నది జలాల నిర్వహాణలో అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడం వలన నీటి నిర్వహణ సక్రమంగా జరిగి రాయలసీమకు ఉన్న నీటి హక్కులను కాపాడుకోవచ్చని ఆ దిశగా కృషి చేయాలని వరదరాజులరెడ్డి ని కోరారు.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతానని వరదరాజుల రెడ్డి హామీ

రాయలసీమ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే నీటి వనరులు ముఖ్యమని అందుకు కావలసిన రిజర్వాయర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి రాయలసీమ అభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణను చేపట్టాలని కోరారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు, తదితర నిర్మాణాల సాధనకు రాయలసీమ ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని వరదరాజులరెడ్డి గారిని దశరథరామిరెడ్డి కోరారు. రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి తన సహాయ సహకారాలు తప్పక ఉంటాయని, ఈ అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతానని వరదరాజుల రెడ్డి గారు హామీ ఇచ్చారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top