హైదరాబాద్: ‘దేవర’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక రద్దయ్యింది. పరిమితికి మించి అభిమానులు చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు చర్యలతో పోలిస్ , ఈవెంట్ మేనేజ్ మెంట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్ పాసులు పొందిన వారూ..పాసులు పొందనివారు సైతం .. వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. ఆడిటోరియం నిండిపోవడం , అంతకు మించి బయట అభిమానులు ఉండటం చూసి నిర్వహణ అధికారులు చేతులెత్తేశారు. తన అభిమాన నటుడిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇలా జలగడంతో జిర్నించు కోలేక అడితోరియంలోని అద్దాలు , కుర్చీలు , ఇరగ్గోట్టారు , కొద్దిసేపు పోలీసులకు , అభిమానులకు మద్య తోపులాట జరిగి కొంత ఉద్రిక్తత పరిస్తితులు ఏర్పడ్డాయి. . పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హోటల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్ ఈవెంట్ ను రద్దు చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ వెనుదిరిగి వెళ్లినట్టు తెలిసింది.
‘దేవర’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిచారు .. ఇలా జరగడం చాలా బాధాకరం .. అభిమానులకన్నా నేను ఇంకా నేను ఎక్కువ బాధపడుతున్నానని అన్నారు . దేవర సినిమా షూటింగ్ లో నేను పడ్డకష్టం నా .. అభిమానులతో పంచుకోవాలని చాలా , ఇలా అవకాశం వచ్చినప్పుడే అభిమానులతో గడపాలని నాకు చాలా ఇష్టమని అన్నాడు . కానీ ఈ వెంట్ మేనేజ్ మెంట్ ని తప్పు పట్టోద్దని అభిమానులకు పిలుపునిచ్చారు .
మీరు చూపే అబిమానానికి రుణపడి ఉంటా..
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలనుకున్నాను. సెక్యూరిటీ కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేశాం. దీనికి నిర్మాతలను, ఈవెంట్ ఆర్గనైజర్లను నిందించడం తప్పని నా అభిప్రాయం. మీరు కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈరోజు కుదరకపోయినా సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం దేవరకు అవసరం. మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత’ అని ఓ వీడియో రిలీజ్ చేశారు. 27వ తేది ప్రతి ఒక్కరు సినిమా చూసి ఎప్పటి లాగే ఆదరిస్తారని కోతుకుంటున్నా అన్నారు
Devara Release Trailer (Telugu) | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva |
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఓ హోటల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఇది రద్దయ్యింది.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
అభిమానుల ఓవరాక్షన్
హీరోలంటే పడిచచ్చిపోయే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. తమ అభిమాన తారల పుట్టినరోజు నాడు రక్తదానం, అన్నదానం , ఇతర సేవా కార్యక్రమాలతో మంచి చేస్తుంటారు. తమ అభిమాన నటుడిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి వేల రూపాయలు కర్చు పెట్టుకొని వచ్చి ఇలా జరిగి వారికి తిక్కరెగితే హీరోలు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఎన్నోసార్లు ఈ అభిమానుల ఓవరాక్షన్ వల్ల హీరోల పరువు బజారున పడింది. తాజాగా ఫ్యాన్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందుల్లో పడ్డారు.