నీటి ముంపు భూములపై..పెత్తం దార్ల కన్ను..
AP : నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం ప్రాంతంలోని.. కృష్ణా నది తీరంలో పాత సిద్దేశ్వరం, జానాల, బలపాల తిప్ప అటవీ ప్రాంతంలో 40 సంవత్సరాల క్రితం నుంచి ఈరోజు వరకు ఈ మూడు గ్రామాల్లో సుమారు 3వందల కుటుంబాలకు పైగా జీవిస్తున్నారు.
నాగరికతకు దూరంగా జీవిస్తున్న వారిపై ఇంత దారుణమా..
నాగరిక జనజీవనానికి దూరంగా ఒకవైపు కృష్ణానది, మరోవైపు దట్టమైన నల్లమల అభయ అరణ్యంలో ఈ కుటుంబాలు జీవిస్తున్నాయి. గతంలో విలువైన భూములు నివాస స్థలాలు గృహాలు పశు సంపదను కోల్పోయిన బాధితులకు అప్పట్లోనే ఉద్యోగాలు, నష్టపరిహారం, స్థలాలు , బ్యాంకులో నుంచి రుణాలు ఇంటికొక ఉద్యోగాన్ని ప్రభుత్వాల నుంచి పొందారు కానీ.. ఈ మూడు గ్రామాల బాధితులు 2009 సంవత్సరం భారీ వరదలకు చిన్న భిన్నం అయ్యారు. 10 కిలోమీటర్ల దూరంలో జానాల గూడెంలో కృష్ణ తీర ప్రాంతంలో నివాసాలను ఏర్పరచుకున్నారు. కేవలం కృష్ణా నదిలో చేపల వేట పైనే జీవిస్తున్నారు.
గ్రామాలపై దాడులకు దిగుతున్న కిరాయి గూండాలు ..!!
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తగ్గినప్పుడు మునక భూములు తేలుతాయి వాటిని సాగు చేసుకుంటూ తిండి గింజలను పండించుకొని జీవిస్తున్నారు. అయితే గతంలో నష్టపరిహారాన్ని పొంది జీవితంలో బాగా స్థిరపడ్డ పూర్వపు నిర్వాసితులు ఈ మూడు గ్రామాలపై కన్ను వేశారు. బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో ఈ భూములు తమవే అంటూ.. తిరిగి ప్రవేశించి ఈ మూడు గ్రాములపై దాడులకు పాల్పడ్డారు. మరికొందరు ఈ సమస్యను నందికొట్కూరు తాలూకాలో రాజకీయంగా వాడుకుంటూ.. ఈ మూడు గ్రాములపై దాడులకు దిగుతూ వస్తున్నారు.
రోజురోజుకూ .. పెరుగుతున్న దాడులు ..
దీంతో ఘర్షణలు త్రీవ స్థాయికి చేరుకొని కిరాయి గుండాలను దించి అక్కడి వారిపై దాడులు చేయించారు. ఈ మూడు గ్రామాల్లో కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గిపోతే సుమారు 12 వందల ఎకరాలకు పైగా భూమి బయటపడుతుంది. ఎలాంటి ఆధారం ఉపాధి లేని ఈ మూడు వందల పైగా కుటుంబాలు మునక భూమిని సాగు చేసుకుని బతుకుతున్నాయి. ఒక్కొక్కసారి ముందస్తుగా వస్తే సాగు చేసిన భూములు మునిగిపోతాయి ఎగువనున్న 150 ఎకరాల వర్షాధార భూమి లో చినుకు పడకపోతే అది కూడా ఇక్కడ వారికి నష్టాన్ని తెచ్చిపడుతుంది.
పెత్తం దార్ల వైపే అధికారులు ..!!
గత ఐదేళ్ల నుంచి పూర్వపు నిర్వాసితులు తిరిగి ప్రవేశించి ఘర్షణలకు పాల్పడ్డం కొందరు పై హత్యాయత్నాలు కూడా జరిగాయి. దీంతో జిల్లా పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో 145 సెక్షన్ విధించింది ఎవరు కూడా ఈ భూములను సాగు చేయకూడదని ఆంక్షలు విధించి బాధితులపైనే కేసు నమోదు చేశారు.
ఒడ్డున పడ్డ చేపల్లా మూడు గ్రామాల రైతులు ..
ఒక వైపు చేపల వేట లేక మరోవైపు పంటల సాగు నిలిచిపోవడంతో ఇక్కడ బాధితులు ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల లాడి ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం టిడిపి నుంచి నంద్యాల ఎంపీ గా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి గెలిచారు. బాధితుల పక్షాన బైరెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యను వివరించడంతో.. బాధితులు సాగు చేసుకుని జీవనం సాగించవచ్చని భూములపై మాత్రం ఎలాంటి హక్కు ఉండదని జల వనరుల శాఖ కు మాత్రమే హక్కు ఉంటుందని కలెక్టర్ చెప్పడంతో మూడు గ్రాముల రైతులు మునక భూముల్లో పెరిగిన ముళ్ళ పొదలను చెట్లను జెసిబి లతో తొలగిస్తుండగా.. పోలీసులు అక్కడికి చేరుకొని పనులను అడ్డగించారు. దగ్గర ఉండి పనులను చేయించేందుకు వెళుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంగమేశ్వర క్షేత్రంలో పూజలు చేసుకుని బయటికి వస్తుండగా ఆయనను పోలీస్ అధికారులు ముందుకు కదలనియకుండా సాయంత్రం చీకటి పడేంత వరకు నిలిపివేశారు.
నేను మీకు అండగా వుంటా .. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ..
దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహించారు. మునక పొలాల్లో హక్కు లేకపోతే నందికొట్కూరు ప్రాంతంలోని ఐదు మండలాల్లో సాగు అవుతున్న మునక భూములను ఎందుకు నియంత్రించలేదని పోలీస్ అధికారులకు సూటిగ ప్రశ్నించారు. వేలమంది రైతులు స్థిరప్రాంత భూములను సాగు చేస్తుంటే వారిని వదిలి ఇక్కడికి రావడం పనులను ఆపడం దీని వెనక ఎవరు రాజకీయం చేస్తున్నారో .. తనకు తెలుసునని ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను సాగు చేసి తీరుతామని పోలీస్ అధికారులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరించారు.
దీంతో ఇరిగేషన్ అధికారులు వారం రోజులుగా ఈ మూడు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టి ఆధార్ కార్డును రేషన్ ఓటర్ కార్డులను పరిశీలించి ఆ నివేదికను జిల్లా కలెక్టర్ జల వనరుల శాఖ ముఖ్య అధికారులకు పంపిస్తామని చెప్పడంతో.. బైరెడ్డి సమ్మతించారు వారం రోజుల తర్వాత తిరిగి భూములను సాగు చేసి సిద్దేశ్వరం , జానాల , బలపాల తిప్ప.. ప్రాంత బాధిత నిర్వాసితులకు న్యాయం చేసి తీరుతానని బైరెడ్డి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఖడా ఖండిగా శబధం చేశారు.
Read this