- పట్టణంలో విపరీతంగా కుక్కల బెడద
- వాహనాల వెంట పడుతున్న కుక్కలు
- ప్రమాదాలకు గురవుతున్న వాహన చోదకులు
- ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలపై దాడి
- కుక్కలకు భయపడి హడలిపోతున్న జనం
- పట్టించుకోని పాలకులు, అధికారులు
- ప్రతి వార్డులో గుంపులు గుంపులుగా కుక్కలు
- పెంపుడు కుక్కలకు లైసెన్సు తప్పనిసరి
- ” కుక్క కరిస్తే ప్రాణానికే ప్రమాదం
AP- KURNOOL , ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన వారిని దాడి చేసి గాయాల పాలు చేస్తున్నాయి. కుక్కలు బౌ..బౌ అంటే చాలు ప్రజలు ప రుగులు పెడుతున్నారు. అలా పరుగులు పెట్టిన వారిని వెంటాడి మరీ కుక్కలు కరుస్తున్నాయి. పట్టణంలో కుక ్కల బెడద రోజురోజుకు అధికమవుతుంది. కుక్కల బెడద వల్ల వాహన చోదకులు, పాదాచారులు, పిల్లలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో ఉన్న 34 వార్డులలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. ఇవి వెళుతున్న వాహనాలను వెంటపడి తరుము తాన్నాయి. కుక్కలు వెంట పడుతుండడంతో వాహన చోధకులు భయపడడం వల్ల వాహనాలు అదుపు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగు తున్నాయి. కాలినడకగా వెళ్లే వారికి కూడా కుక్కల బెడద తప్పడం లేదు.
ఇక చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయాలపాలు చేస్తున్నాయి. చిన్నపి ల్లలు పై కుక్కలు దాడిలో గాడి పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. పిల్లలు కుక్కలను చూసి పరుగులు తీస్తారు.ఇలా పరుగులు తీసే వారి వెంటపడి కుక్కలు తరుముతున్నాయి. పొరపాటున చిక్కితే ఎక్కడపడితే అక ్కడ కొరికి వదిలేస్తున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా పన శిస్తున్నాయి. వాటిని దాటాలంటే చాలా జాగ్రత్తగా వెళ్లాలి. పొరపాటున శబ్దం చేస్తే అవి లేచి వెంట పడతాయి. కుక ్కలు ప్రధాన రహదారిలో విచ్చలవిడిగా తిరుగుతున్న పట్టించు కునే నాథుడు కరువయ్యారు. మున్సిప ల్ అధికారులకు కుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది.
ఇక పాలకుల కైతే కుక్కల వల్ల ప్రజలు పడుతున్న పాట్లు కనిపించడం లేదు. గతంలో మున్సిపాలిటీ వారు కుక్కలను ప ట్టుకెళ్ళి చంపేవారు.ఇది జంతువు ప్రేమికులకు చాలా బాధను కలిగించింది. మున్సిపాలిటీ వారు అప్పటి నుండి కుక్కలను పట్టుకుని అటవీ ప్రాంతాలలో వదిలి వచ్చేవాం స ఇప్పుడు అది కూడా చేయడం లేదు. అందువల్లనే కుక్కల సంఖ్య రోజుకు పెరిగి పోయింది. కుక్కలను పట్టు కోమని మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుంటే మూగజీవులను హింస పెట్టరాదని, పైగా వాటిని ప్రేమించాలని మునిసిపల్ అధికారులు ఆ కాకమ్మ కథలు చెపుతున్నారు. కుక్కలు ప్రధాన రహదారుల్లో కంటే వీదుల్లోనే అధికంగా కనిపిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన 20 కుక్కలు తక్కువ లేవు. ఇవన్నీ ఆవార్డు వాసులను ఇబ్బంది పెడుతు న్నాయి. ఇంటి ముందున్న అరుగులపై కుక్కలు స్వేద తీరుతున్నాయి. అక్కడే మల, మూత్ర విడ సర్జనను గావిస్తున్నాయి. గృహాల వారికి కుక్కలు ఈ రకంగా ప్రత్యేక పనిని పెడుతున్నాయి. కుక్కలు మల మూత్ర విసర్జన చేసిన తర్వాత అరుగులు శుభ్రం చేయడమే వార్డు ప్రజలకు పెద్ద పనైపోయింది. కుక్కలను ఎంత దూరం కర్రలతో బెదిరించి తరిమినా?అవి మాత్రం వార్డులు వదిలి వెళ్ళడం లేదు. అరుగులపై కూర్చోవడం మానలేదు. వాహన చోదకులు కుక్కలు అధికంగా ఉన్న వార్డులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కుక్కలు కనిపిస్తే ఆమడ దూరం నుండే వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు.
కుక్కలు కరిస్తే మొదట టిటిఇంజక్షన్ వేయించుకోవాలి. ఆ తర్వాత రోజుకు ఒకటి చొప్పున యాంటీ రేబిట్స్ ఇంజక్ష న్లు వేయించుకోవాలి. కుక్క కరిస్తే మినరల్ వాటర్ తాగాల్సి ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ నీళ్లు తాగడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా నీళ్ల బాటిల్ సంకలో పట్టుకు వెళ్లాలి. నీళ్లు మారితే కూడా కుక్క కరిచిన వారికి ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు. దాదాపు నెల రోజులు పాటు డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాల్సిందే. కుక్క కాటుకు గురయ్యారంటే చాలు డాక్టర్లు వెంటనే ఈ ఇంజక్షన్లు వేయించుకోమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఏకుక్క పిచ్చిదో? మంచిదో? ఎవరికీ తెలియదు. కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్లు కేవలం ప్రభుత్వాసుప త్రి లోనే లభ్యమవు తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురైన వారే అధికంగా కనిపిస్తూ ఉంటాం 3. కుక్కలను పెంచుకున్న వారి కుక్కలు కూడా రోడ్లపైకి వచ్చి వీధి కుక్కలపై విరుసుకు పడుతున్నాయి. ఇంటి వద్దకు వచ్చి కొత్తవారు అమాంతం వారి పై దాడి చేస్తున్నాయి. పెంపుడు కుక్క పెంచుకున్న వారు అవి వేరే వారిపై దాడి చేయకుండా జాగ్రత్త పడాల్సి వస్తోంది. వీధి కుక్కల వల్ల కాస్త ప్రయోజ నాలు కూడా ఉన్నాయనే చెప ఎవచ్చు.
వీధుల్లో కుక్కల అధికంగా ఉండడం వల్ల కొత్త వ్యక్తులను వీధిలోకి రానివ్వడం లేదు. వాహన చోదకులను కూడా వేగంగా వెళ్ళనివ్వడం లేదు. వాహనాలు వేగంగా వెళ్తే కుక్కలు వెంటపడతాయని వాహన చోదకులకు తెలుసు. అందుకే కుక్కలు కనిపిస్తే చాలు వాహన చోదక ఎలు వాహనాన్ని నెమ్మదిగా నడుపుతూ కుక్కలను దాటేసి వెళ్తున్నారు. వీధి కుక్కల వల్ల దొంగతనాలు కూడా జర గడం లేదు. రాత్రిళ్ళు కుక్కలు వార్డులోని ప్రజల కోసం గస్తీ కాస్తున్నారు. కొత్త వ్యక్తి రాగానే అవి అరుస్తున్నాయి. వెంటనే వార్డులలోని ఇరుగు పొరుగు వారంతా లేచి ఏమి?జరిగిందో? అని చూస్తున్నారు. వీధి కుక్కలు చిన్నచిన్న గల్లీలలో అధికంగా ఉండడం వల్ల దొంగలు పడడానికి వీలు లేదు. అందుకే దొంగతనాలు కేవలం పెద్దపెద్ద కాలనీలలో మాత్రమే జరుగుతున్నాయి. చిన్న చిన్న గల్లీలు ఉన్న వార్డులలో తాళాలు వేసిన ఇళ్ళ ముందు కుక్కలు ఎవరు లేరని స్వేద తీరుతూ ఉంటాయి. అందువల్ల వీధి కుక్కల వలన పరోక్షంగా వార్డు ప్రజలకు కాస్త మేలు జరుగుతుంది. అందుకే కొన్ని వార్డులలో ప్రజలు వీధి కుక్కల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉంటే? ఉండని కాస్త అన్నం పెడితే అవిశ్వాసంగా ఇళ్లను కాపలా కాస్తాయని ప్రజలు అంటున్నారు.
పెంపుడు కుక్కలకు లైసెన్స్ ఉండాల్సిందే : ధనవంతులకు కుక్కలను పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కుక్కలను పెంచుకోవాలంటే మున్సిపాలిటీలో లైసెన్సు కచ్చితంగా తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా పెంపుడు కుక ్కలను పెంచితే అవి ఊరి కుక్కల జాబితాలోకే చేరుతాయి. వాటిని ఎప్పుడైనా మున్సిపాలిటీ అధికారులు పట్టుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కుక్కలు కరిస్తే ప్రమాదం జరగకుండా యాంటీ రేబిట్స్ ఇంజక్షన్లు వేయించాలి. ఇంజక్షన్లు చేయించ డం వల్ల కుక్కలు కరిసిన వారికి ప్రమాదం ఏమీ ఉండదు. ఒక్క టీటీ ఇంజక్ష న్ వేయించుకుంటే సెప్టిక్ కాకుండా ఉంటుంది. తరువాత యాంటీ రేబిట్స్ ఇంజక్షన్లు వేయించుకునే బాధ కూడా తప తుంది. అందుకే మునిసిపల్ అధికారులు పెంపుడు కుక్కలకు లైసెన్సులు తీసుకోమని నెత్తి నోరు బాదుకుంటు న్నారు. కానీ ఎమ్మిగనూరులో కుక్కలను పెంచుకున్న వారు లైసెన్సులు తీసుకున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు. దీనికి కారణం మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడమే.
కుక్క కరిస్తే ప్రాణానికి ప్రమాదం : కుక్క కరిచిన వెంటనే టిటి ఇంజక్షన్ వేయించిన తర్వాత, యాంటీ రేబిట్స్, ఇంజక్షన్ వేయించకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇంజక్షన్ చేయించకపోవడం వల్ల కొద్ది రోజులకి కుక్క కరిచిన వ్యక్తికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి కుక్క కరిచిన చోట గాయం మానకపోవడం వాపు ఎక ్కడం మొదట కనిపిస్తాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి అవ్యక్తి అచ్చం కుక్కల మొరగడం మొదలుపెడతాడు. అంతేకాకుండా కనిపించిన వారిపై దాడి చేయడానికి క ూడా ప్రయత్నిస్తాడు. అలాంటి సమయాలు ఆ వ్యక్తిని గొలుసులతో బంధించి ఉంచుతారు. ఆతర్వాత రోజురోజుకి కుక్క లక్షణాలు అధికమై ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది. అందుకని కరిచిన కుక్క పిచ్చిదా? మంచిదా?అని తెలిసినా? తెలియకపోయినా డాక్టర్లు యాంటీ రేబిట్స్ ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించు కోవాలని సూచిస్తారు. ఏది ఏమైనా ఎమ్మినూరు ప ట్టణంలో కుక్కల బెడద అధికమై కొంత లాభం, అధిక నష్టం ఉందనే చెప్పాలి.










