ఇన్నాళ్లూ అసెంబ్లీలో గళమెత్తిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తాగునీటి కోసం పట్టుపట్టారు. రబీలో సాగు, తాగునీటి కోసం రైతుల పక్షాన నిలిచి ముక్తకంఠంతో ఐఏబీ. సమావేశంలో తమ వాణి వినిపించారు. మంగళవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్లో లో నీటి విడుదలకు సంబందించిన ఐఏబీ సమావేశం మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరిగింది. రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు ప్రజల నుంచి వినిపించకూడదని, ఇప్పటి నుంచే తగిన కార్యచరణతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విదంగా వీలైనంత ఆయకట్టుకు ప్రస్తుత రబీలో హంద్రీనీవా, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ నుంచి నీటిని అందించాలని పంట చివరి దశలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుతో పాటు హంద్రీనీవా నుంచి ప్రస్తుత కేటాయింపునకు అదనంగా మరో 10 టీఎంసీల నీటిని కేటాయించాలని ఇతర ముఖ్యమైన అంశాలపై ఐఏబీ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు
ఐఏబీ సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సంవత్సరం వర్గాలు బాగా పడ్డాయని, అందువల్ల ఎక్కడా తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందకూడదన్నారు. రాబోయే వేసవిలో తాగునీటి సమస్యను అత్యధిక ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో నీటి సప్లయ్ డిస్ట్రియ్యీషన్ సిస్టమ్, సీపీడబ్ల్యూఎస్ పథకం కింద పిల్లర్ బెన్స్ అండ్వం విభాగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులను మంత్రి ప్రశ్నించారు. కొన్ని బేట్ల పిల్లర్ బెర్స్తో పాటు ఓఆండ్ ఎం సమస్యలు గుర్తించామని, ఈ అంశంపై నిధుల మంజూరు. కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్లు అధికార తెలిపారు. ప్రతిపాదనల వివరాలు తనకు అందించాలని ప్రయుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్‌కు ఎత్తిపోతల పథకాలకు సంబందించి లోరీ కేసులపై సమావేశంలో చర్చించారు. రూ.26 కోట్ల విలువ దేసే ఆయిల్ పాటు కావర్ చోరీ జరిగిందని, మోటార్లు రన్నింగ్ కండీషన్లో తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మైనర్ ఆరిగేషన్ ఎన్క రెడ్డి తెలిపారు.
- వాడీవేడిగా ఐఏబీ సమావేశం
- సాగు, తాగునీటి కోసం ఎమ్మెల్యేల పట్టు
- ఎల్లెల్సీ, హంద్రీనీవా విస్తరణతో మరో 10 టీఎంసీలకు కార్యాచరణ
ఐఏబీ సమావేశంలో కీలక తీర్మానాలు:
- కేసీ కెనాల్ కింద ప్రస్తుతం ఎక్కువ ఆయకట్టు నంద్యాల జిల్లాలో ఉన్నందున అక్కడ నిర్వహించే ఐఏబీ సమావేశంలో ఎంత ఆయకట్టుకు నీరందించవచ్చునో నిర్ణయం తీసుకోవాలి.
- ఎల్ ఎల్సి కింద ఆయకట్టుకు డిసెంబరు 10 నుంచి మార్చి ఆఖరి వరకు నీటిని అందించాలి..
- హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదక విస్తరణ పనులు జరిగే అవకాశం ఉన్నందున అదనంగా అవించే నీటిలో కర్నూలు జిల్లాకు 160 టీఎంసీలు ప్రభుత్వం రేటా యించాలి..
- గాజుల్న ప్రాజెక్టు కింద నవంబరు 30 నుంచి 15 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలి.
- వచ్చే మార్చి ఆఖరు నాటికి 08 చెరువులకు నీటిని నింపే. కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
కృష్ణ, తుంగభద్ర తదితర ఉప నరులు కర్నూలు మీదుగానే ప్రవహిస్తున్నాయి. అందుకోసం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అణువుగా కర్నూలు కేంద్రంగా కృష్ణా మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలి.










