- వేతనాల కోసం ఎదురు చూపులు
- 108,104 సిబ్బందిపై జాలి చూపని కూటమి ప్రభుత్వం
- ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి
నంద్యాల జిల్లా , కొలిమిగుండ్ల : పగలు, రాత్రి తేడా లేకుండా మారు మూల గ్రామాల్లో సైతం ప్రజల ప్రాణాలు కాపాడేం దుకు విధులు నిర్వహిస్తున్న 108,104 ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోంది. నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా, దీపావళి పండుగలు సైతం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోలేక పోయారు. 108, 104 సేవలను అర బిందో సంస్థ నిర్వహిస్తోంది. మూడు నెలలకు ఒకసారి నిధులు ఇచ్చేలా కూటమి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. సకాలంలో ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో 108 వాహనాలు 30 ఉండగా 142 మంది ఉద్యోగులు విధులు నిర్వ హిస్తున్నారు. 104 వాహనాలు 30 కాగా 70 మంది మేర పనిచేస్తున్నారు. 108లో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఈఎంటీలు, ఒకరు రిజర్వులో ఉంటారు. 104లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పని చేస్తుం టారు. జూలై నుంచి ఒక్క పైసా చెల్లించలేదు. చాలా మంది ఉద్యోగులకు వేతనాలు లేకపోవడంతో బం ధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సిన పరి స్థితి, అత్యవసర సమయంలో గోల్డెన్ అవర్కు ప్రాధాన్యం ఉంది. ప్రమాదం జరిగిన వ్యక్తికి గంట వ్యవధిలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తే ప్రాణాప్రాయం నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దిగంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 108 వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన తర్వాత సీఎంగా కొనసాగిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి అదే బాటలో కొనసాగించారు. కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
పనిభారం అధికం; 108 వాహన సిబ్బందికి పని భారం పెరుగుతోంది. ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు, మహిళల ప్రసవాలు, ఇతర ఆనారోగ్య సమస్యలకు చెందిన కేసులు వస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయ పడిన వారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చించి వైద్యం అందించేందుకు సిబ్బంది ఎంతో ఆరాటపడుతుంటారు. 24 గంటల పాటు అప్రమత్తంగా పని చేస్తూ ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకుం టుంటారు. అయినా ప్రభుత్వం సకాలంలో వేత నాలు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి లోనవుతు న్నారు. ప్రభుత్వం నుంచి అరబిందో సంస్థకు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. వాటిలోనే వాహనాల నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు ఆ సంస్థ చెల్లిస్తుంది. ఇందుకు గాను ప్రభుత్వం పాత 108 వాహనానికి రూ.2.20 లక్షలు, కొత్త వాహనా నికి రూ.1.90 లక్షలు చెల్లిస్తుంది.
గ్రామాలకు 104 వరం
గ్రామీణ ప్రజలకు 104 వాహన సేవలు వరంగామారాయి. 104లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈసీజీతో పాటు తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు ఉచితంగా అంద జేస్తారు. ప్రజలకు ఇన్ని రకాల సేవలు అం దిస్తున్నా సకాలంలో జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
నాలుగు నెలలుగా అందని వేతనాలు; ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వేత నాలు ఇవ్వలేకపోతున్నామని అరిచిందో సంస్థ చెబుతోంది. దీంతో నాలుగు నెలలుగా వేతనాలు రాక ఉద్యోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. సేవలు బంద్ చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఉద్దేశంతో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వారి బాధలను భరిస్తునే నవ్వుతూ విధులు నిర్వహి స్తున్నారు. తమపై కూటమి ప్రభుత్వం కక్ష పూరి తంగా వ్యహరిస్తోందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. 108 పైలెట్లు, ఈఎంటీలకు రూ.20 నుంచి రూ.30వేలు వేతనం అందుతోం ది. 104 డ్రైవర్లకు సీనియారిటీని బట్టి రూ.14వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుం ది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.15వేలు వేతనం ఇస్తున్నారు.