నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీగా గంజాయి పట్టుబడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆత్మకూరు సీఐ రాము ఆధ్వర్యంలో జరిపిన మెరుపు దాడుల్లో 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆత్మకూరు-నంద్యాల రోడ్డులోని ఉర్దూ స్కూల్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారిని కేతం పుల్లయ్య మరియు తెలుగు శ్రీరాములుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు కేతం పుల్లయ్య ఒడిస్సాలోని బరంపూర్ నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడ కిలో రూ.20 వేలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ గంజాయిని 10 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి, ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500/- లకు అమ్ముతున్నట్టు విచారణలో తేలింది.
పట్టుబడిన నిందితుల వెనుక ఉన్న ముఠా గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామమని ఈ గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషించిన ఒడిస్సాకు చెందిన బోస్ కిశోర్, తెలంగాణకు చెందిన తిరుపాలు సహా పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటాంమని ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి ముఠా మూలాలను ఛేదించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు










