పసుపు పచ్చ కప్పలు, కనువిందు చేశాయి. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి, నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని, కబేల వీదిలోని ఒక చిన్న కుంటలో, వందకు పైగా పసుపు రంగు కప్పలు, బేకబికమంటూ శబ్దం చేస్తూ ఉండడంతో, అటువైపు వెళుతున్న పట్టణవాసులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండే రంగుకు భిన్నంగా, పసుపు రంగులో ఉండడాన్ని ఆశ్చర్యంగా, పట్టణ వాసులు తిలకించారు. తమ సెల్ ఫోన్ లలో వాటిని చిత్రీకరించారు. అయితే, ఈ పసుపు రంగు కప్పల గురించి వివరంగా తెలుసుకుంటే, ఇవి సాధారణంగా మిగతా రోజుల్లో కనపడవని, కేవలం, వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి.
పసుపు రంగు కప్పలు భారత బుల్ ఫ్రాగ్స్, ఇవి భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక మరియు మయన్మార్ వంటి, దక్షిణాసియా దేశాలలో, విస్తృతంగా కనిపిస్తాయి.
రంగు మార్పు సాధారణంగా, ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉంటాయి. అయితే, సంతానోత్పత్తి కాలంలో, పొడి వాతావరణం నుండి వర్షాకాలం మారినప్పుడు, మగ కప్పలు, ఆడ కప్పలను ఆకర్షించడానికి, మరియు తమ ప్రాంతాన్ని గుర్తించడానికి, ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మారుతాయి. ఈ పసుపు రంగు, చాలా స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా కనపడతాయి.
పసుపు రంగు, భారత బుల్ ఫ్రాగ్స్ వర్షాకాలం ప్రారంభమైనట్లు, మరియు సంతానోత్పత్తి కాలం వచ్చిందని సూచిస్తాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, కీటకాలను నియంత్రించడంలో సహాయపడతాయి. భారత బుల్ ఫ్రాగ్స్, ఇవి వర్షాకాలంలో తమ రంగును పసుపుగా మార్చుకుని, తమ సహజ ఆవాసాలలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఇవి భారతదేశంలో కనిపించే, అతిపెద్ద కప్పలలో ఒకటి, సుమారు 6.5 అంగుళాల (16.5 సెం.మీ) పొడవు వరకు పెరుగుతాయి. వర్షాకాలంలో ఇవి నీటి గుంటలు, చెరువులు, నదులు మరియు పొలాల వంటి నీటి వనరుల దగ్గర నివసిస్తాయి. ఇవి బురద నీటిలో ఉండటానికి ఇష్టపడతాయి.
సంతానోత్పత్తి కాలంలో, మగ కప్పలు పెద్దగా “గర్-ర్-ర్-ర్” అని ధ్వనిస్తాయి, ఇది చాలా దూరం వినిపిస్తుంది. ఈ ధ్వని, వాటి గొంతు కింద ఉండే, పెద్ద శబ్ద కోశం ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఇది కూడా పసుపు రంగులో ఉంటుంది.ఇవి కీటకాలు, చిన్న సరీసృపాలు, ఎలుకలు మరియు కొన్నిసార్లు చిన్న పక్షులను కూడా తింటాయి.