యాగంటి బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు.
రాళ్లకు జీవం ఉంటుందా.. ! మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా? అనే ప్రశ్నలకు చాలామంది అదెలా సాధ్యం అని సమాధానం ఇస్తారు.
అయితే .. యాగంటి క్షేత్రంలోని ఉమా మహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే.. అక్కడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది. అంతేకాదు.. ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది.
నంద్యాల జిల్లా (ఉమ్మడి కర్నూలు)లో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం.
ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు.
కర్నూల్ జిల్లా బనగానే పల్లె కు సమీపంలో కొలువైన యాగంటి క్షేత్రం ఉమ మహేశ్వరులు కొలువైన దివ్యమైన హరి హర క్షేత్రం..
ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఒక సారి అయినా చూడవలసిన ప్రదేశం.
బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు.ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది.ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు.
( ఇది ఒడ్డు, పొడుగు, ఎత్తు అన్ని వైపులా) .ఈ విధంగా పెరిగే సరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది. నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టు ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే, నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు గానీ, వీడియోలుగానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపడేస్తారు. కానీ, ఆ నంది సైజు పెరగడం నిజమే.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్థారించారు.
ఈ క్షేత్రంలో ఇంకా చాలా మహిమలున్నాయి..
1. మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట… ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి … ఇక్కడ నా విగ్రహం ప్రతిష్టించు… అని అదేశించాడట… ఇక్కడ ఉన్న శివ లింగం లో నే శివుడు.. పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు … ఈ క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత.
అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో..
2. అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని… అగస్త్యుడు శపించాడట … అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు…. (అగస్త్యుని యాగం వలన ఖ్యాతి చెందింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని ఒక వినికిడి )
౩. శని వాహనం కాకి .. ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండను… అని అయన చెప్పాడంట… అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు…. ఆ ప్రదేశం లో నందీశ్వరుడు ఉంటాడు.
4. ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలు పెట్టారు కాబట్టి… ఈ ఆలయం నిర్మాణం విష్ణు ఆలయాల మాదిరి ఉంటుంది…
తయారు చేసిన వెంకటేశ్వరస్వామిని ఒక గుహలో ఉంచారు.
5. కోనేరు లో నీరు ఎక్కడ నుండి వస్తుందో… తెలియదు…సంవత్సరం లో 365 రోజులు నీరు ఉంటుంది.
6.వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది. దాన్ని శివ గుహ అని అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణుక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్తుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునఃనిర్మించారు
జీవిత కాలంలో ఒకసారైనా చూడదగిన క్షేత్రం యాగంటి.
ఆలయ సమయాలు
6AM–1PM, 3–7:30PM
ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి