- పులుల ఆవాసంగా నల్లమల
- నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) ఆంద్ర ప్రదేశ్ లోనే ఏకైక టైగర్ రిజర్వ్
- పులి సంరక్షణకు ప్రత్యేక సాయుధ బలగం ఆహార జంతువుల పెంపునకు కృషి
- ప్రతీ సంవత్సరం జులై 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం
అందంలోనూ.. బలంలోనూ పెద్ద పులికి సాటిరాగల మరో జంతువు భూమిపై కనిపించదు. అది నడుస్తుంటే రాజసం తొణికి సలాడుతుంది. భూమిపై అంతరించి పోతున్న జాతుల జాబి తాలో చేరి రెడ్ డాటా బుక్ లో నమోదు అయిన అపురూపమైన పులి నల్లమల ప్రాంతంలో మీసం మెలేస్తోంది.
తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పర్యావరణానికి రక్షణగా నిలుస్తోంది. అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో నల్లమల పెద్దపులి గాండ్రి స్తోంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏకైక టైగర్ రిజర్వు అయిన నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు 5,360.22 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి, భారతదేశములోనే అతి పెద్ద టైగర్ రిజర్వుగా పేరు ప్రఖ్యాతలను సంపాదించు కుంది .. ఇది తూర్పు కనుమలలో భాగమైన నల్లమలలో ఉంది.
నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు అంతరించి పోతున్న అనేక వృక్ష మరియు జంతుజాలాలు సంతరించుకొని ఒక సహజమైన మరియు ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ మరియు గొప్ప జీవ వైవిధ్యాల భాండాగారముగా నిలిచి సహజ వారసత్వానికి ప్రసిద్ధిగాంచింది.
కృష్ణా నది భౌగోళికంగా అతి పురాతన మైనది. ఈ నది సుమారు 200 కి.మీ. కంటే ఎక్కువగా ఈ రిజర్వులో ప్రవహిస్తుంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు, నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఆనకట్టలకు ప్రధాన పరివాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులు పులి సంరక్షణకు ఆశ్రయ దుర్గంగా మారాయి. పులి ప్రవర్ధనానికి ఈ ప్రాంతం అత్యంత అనుకూల పర్యావరణాన్ని కలిగి ఉంది.
నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ) యొక్క జాతీయ పులుల గణన 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 62 పులులను కలిగి ఉన్నాయని .
2023-24 నాలుగవ దశ (ఫేజ్ ఫోర్) పర్యవేక్షణ మరియు విశ్లేషణ ప్రకారము, ప్రస్తుతం నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వు మరియు దాని నడవ (కారిడార్) లో కనీసం 87 పులులు ఉనాయని అంచనా వేశారు.
NSTR లోని పులులు దక్షిణాది వైపు సంచరిస్తూ శేషాచలం బయోస్పియర్ రిజర్వులో తమ ఆవాసాలను ఏర్పరచు కుంటున్నాయి.
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల అభయార ణ్యంగా ఉంటున్న గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభ యారణ్యంలో కూడా పులులు క్రమేపి విస్తరిస్తూ..
వైఎ స్సార్ జిల్లా వరకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా నల్లమలలోని ఆత్మకూరు, మార్కాపురం, నాగార్జున సాగర్ అటవీ డివిజన్లు, తెలంగాణాలోని ..
Nallamala Tigers
అచ్చంపేట అటవీ డివిజన్లలో విస్తరించిన నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో సిబ్బంది పర్య వేక్షణ, మానవ వనరులను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించు కోవడం వంటి అంశాల కారణంగా ఇక్కడ పులులు క్రమేపి పెరుగుతున్నాయి.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
NSTR లో 2014-15 పులుల గణన చేపట్టగా 37 అని తేలింది. పదేళ్లలో ఆసంఖ్య క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం 100 కు పైగా చేరి నట్లు సమాచారం.
విస్తీర్ణం రీత్యా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం దేశంలోనే 54 అభయార ణ్యాల్లో అతి పెద్దది.
అంతే కాకుండా, గత 2 సంవత్సరాల వ్యవధిలో పొరుగు రాష్ట్రాలనుండి వచ్చిన పులులు పాపికొండ జాతీయ ఉద్యానవనం (నేషనల్ పార్క్) లో ..
సంచరించిన ఆధారాలు ఉన్నాయని ,అలాగే పాపికొండ జాతీయ ఉద్యానవనం (నేషనల్ పార్క్) కూడా భవిష్యత్తులో పులులకు ఆవాసంగా మారే అవ కాశాలున్నాయని అటవీ అదికారులు గుర్తించారు.
పులుల సంతతిని పెంచడానికి ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ (APFD) నిరంతర కృషి చేస్తోంది. గత 2 దశాబ్దాల కాలములో పులుల సంఖ్య గణనీయం గా వృద్ధి చెందాయని. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS), ICICI ఫౌండేషన్ మరియు World Wildlife fund for Nature వంటి స్వచంద సంస్థలు (NGOs) ఆంధ్ర ప్రదేశ్ అటవీశాఖకు అనుబంధంగా పులుల సంరక్షణలో తోడ్పాటు అందిస్తున్నాయి.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
సంరక్షణకు STF బలగాలు నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక సాయుధ బలగాల నియామకం జరగబోతోంది.
స్పె షల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (STF)గా పిలువ బడే ఈ బలగాలలో 15 మంది ప్రత్యేక శిక్షణ పొందిన కమెండోలు ఉంటారు.
పులుల అభయారణ్యంలో పులి వేటగాళ్ల నియంత్రణకు సాయుధ బలగం తప్పని సరి చేస్తోంది.
పులి ఆహార జంతువుల నిష్పత్తి పెంచేందుకు యత్నాలు..
నల్లమల పరిధిలోని అడవుల్లో పులికి ఆహార జం తువులైన జింకలు, దుప్పులు, కణుతులు, కొండగొర్రె, మనుబోతు, అడవి పంది వంటి జం తువులు పుష్కలంగానే ఉన్నాయి.
అయినప్పటికీ పులి ఆహర జంతువుల సంఖ్యను పెంచేందుకు అటవీ అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నారు. కాకినాడ సమీపంలోని ..
నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కర్మాగారం గ్రీన్ కవర్ ఆవరణలోని అటవీ ప్రాంతంలో పెంచ బడుతునన్న వన్యప్రాణులను నల్లమలకు తరలించారు.
సుమారు 300 దుప్పులు, 30 వరకు కణుతులను నల్లమలలోని పచ్చర్ల, మార్కాపురం డివిజన్లోని పెద్దమంతనాలలో ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉంచారు.
ఇవి దట్టమైన అటవీ వాతావరణనానికి అలవాటు పడగానే అడవుల్లోకి స్వేచ్చగా తిరిగేందుకు వదలనున్నారు.
పులులు పెరుగుతున్నాయి .. –సాయిబాబా, డీడీ పీటీ, ఆత్మకూరు డివిజన్
Nallamala Tigers
- 2014-15………………….37
- 2015-16 …………………40
- 2016-17 ………………..46
- 2017-18…………………..46
- 2018-19…………………..47
- 2019-20…………………..63
- 2020-21……………………70
- 2021-24……………………87
- నల్లమలలో పెద్ద పులుల సంఖ్య క్రమేపి పెరుగు తోంది. కొన్నిభద్రతా చర్యల్లో భాగంగా వాటి సంఖ్యను తరుచు ప్రకటించి ప్రచారం చేయడం మంచిది కాదు.
- వెయ్యి పులు లను అకామిడేట్ చేయగల నల్లమ లలో పులి ఆహార జంతువులను ఆ నిష్పత్తిలో పెంచాల్సి ఉంది.
- దేశంలోనే విస్తీర్ణంలోఅతి పెద్దదైన నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయార ణ్యం పులుల సంఖ్యలో కూడా దేశం లోనే పెద్దది కావాలన్న ఆకాంక్షలను విజయవంతం చేసేందుకు అటవీ సమీప గ్రామాల ప్రజల, మేధావుల, పాత్రికేయుల సహకారం ఆశిస్తు న్నాము.











