దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టే సమగ్ర మహిళా చట్టాన్ని చేయాలని ఎమ్మిగనూరు సిఐటీయూ నాయకులు , అంగన్ వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు.
కోల్కతాలో ఆర్ జి కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేడికో పై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై సిఐటియు, అంగన్వాడి, ఆశ,
ఆటో యూనియన్ల కార్యకర్తలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో నిరసన కార్యక్ర మాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి అధ్యక్షతన చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి. గోవిందు , బి. రాముడు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి. గోవర్ధనమ్మ,
టౌన్ కార్యదర్శి ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో పసిపిల్లలు మొదలుకొని పండు వృద్ధుల వరకు మహిళలపై రోజురోజుకీ అత్యాచారాలు హత్యలు జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
కోల్కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికో పై జరిగిన అత్యాచారం, హత్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర హోం శాఖ మరియు ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఒక మహిళ డాక్టర్ పై అత్యాచారం జరిగి హత్య చేసిన నిందితులకు సహకరించటం సహించరాని నేరమని ఆమె తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు.
ఆసుపత్రి యజమాన్యానికి పశ్చిమబెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కేసు దర్యాప్తును సిబిఐ కి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు నివేదికను సిబిఐ అందజేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని,
దీనికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారు. ఘటనకు సంబంధించి అత్యాచారం, హత్య చేసిన నిందితులకు వెంటనే కఠిన శిక్షలు విధించాలని కోరారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
కోల్కతా ఘటన మరవకముందే మరలా యూపీలో మరో సంఘటన జరగటం దేశంలోని శాంతిభద్రతల పై ప్రజలకు నమ్మకం పోతుందని తెలిపారు.
మహిళ రక్షణ కొరకు ప్రత్యేక కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.”ఏ దేశంలో అయితే మహిళ అర్థరాత్రి స్వేచ్ఛగా తిరగగలుగుతుందో ఆ దేశ ప్రజాస్వామ్యం నిలకడగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని”మహాత్మా గాంధీ గారు చెప్పిన నినాదం నేడు పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోల్కత్తా ఘటన పై స్పందించాలని కోరారు.
మహిళలకు రక్షణ కల్పించాలి
కోల్కతాలో జరిగిన ఘటన దేశంలో అన్ని వర్గాల ప్రజలను పోరాట మార్గంలో నడిపించిందని ఇప్పటికైనా బాధ్యులను కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.
దేశంలో మహిళలకు రక్షణ కల్పించినప్పుడే భారతదేశం వికసి త్ భారత్ అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు నీరజ, మహేశ్వరి, వరలక్ష్మి, చిట్టెమ్మ, లక్ష్మీదేవి, శశికళ, లతా రాణి, షమీం, గ్రేస్ అమ్మ, మేరీ, ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు శారద, విశాలాక్షి, శివలీల, రాధా, హాజీబీ, మహేశ్వరి, ఏఐకేఎస్ నాయకులు అబ్దుల్లా, సిఐటియు నాయకులు రమేష్, అహ్మద్, రాజు పాల్గొన్నారు.