నూతనంగా మంజూరైన వైయస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు……
వెలుగోడు మండలమునకు గాను 174 మందికి నూతనంగా మంజూరైన వైయస్సార్ పింఛన్ కానుక….. శిల్పా చక్రపాణి రెడ్డి గారు
శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం నందు ykp వెలుగు ఆఫీసు నందు నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు పాల్గొన్నారు …ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన నియోజకవర్గానికి 174 మందికి వైఎస్ఆర్ పింఛన్ మంజూరు అయిందని,అంతేకాకుండా జగనన్న నవరత్నాలు 99 శాతం పూర్తి చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని తెలియజేశారు,
అంతేకాకుండా మన నియోజవర్గం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అంతే కాకుండా గ్రామాలలో పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 71 రోజు పూర్తి చేసుకున్నాము ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ప్రజల సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ విషయంలో అధికారులు సచివాలయ సిబ్బంది చాలా బాధ్యతగా వాళ్ల పనితీరు కనబరుస్తున్నారని సభాముఖంగా అభినందించారు…….
అదేవిధంగా నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పింఛన్ కానుక ను 2750 రూపాయలను పింఛన్దారులకు ఎమ్మెల్యే గారు కార్యక్రమంలో అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ శిల్ప భువనేశ్వర్ రెడ్డి గారు మండల అధికారులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు సచివాల సిబ్బంది వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది