- అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి
- క్యూబా పై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి
- సిఐటియు డిమాండ్
అమెరికా క్యూబా పై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు కోరారు .. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా క్యూబా దేశానికి సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక గడియారం ఆసుపత్రి దగ్గర సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు సిఐటియు ఓల్డ్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంజిబాబు మాట్లాడుతూ అమెరికా దేశం క్యూబా పై ఆర్థిక ,రాజకీయ ఆంక్షలు విధించిందని వీటిని ఎత్తివేయాలని కోరారు ఆహార పదార్థాలుఎగుమతులు చేయనీయకుండా పసిపిల్లలు వాడే పాలపొడి లాంటి పదార్థాలను సైతం ఎగుమతి కాణివ్వకుండా అలాగే వైద్యానికి సంబంధించి ప్రాణ అవసరమైన అనేక మందులను ఎగుమతులు చేయనివ్వకుండా నిత్యవసర వస్తువుల పైన ఆంక్షలు విధిస్తూ క్యూబా సోషలిస్టు దేశంపై అమెరికా సామ్రాజ్యవాద పెత్తనాన్ని కొనసాగిస్తుందని ఆయన విమర్శించారు.
1958 సంవత్సరంలో ఫైడల్ కాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు నాటి నుండి నేటి వరకు అమెరికా క్యూబా ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసినప్పటికీ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సోషలిస్టు వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఒకానొక సందర్భంలో ముడిచమురు క్యూబాకు ఎగుమతులు చేయకుండా ఆంక్షలు విధించిన సందర్భంలో దేశంలోని ప్రజలందరూ దేశ అధ్యక్షుడు తో సహాసైకిల్ మీద ప్రయాణం చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. ఆహార పదార్థాల పైన ఆంక్షలు విధించిన సందర్భంలో ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న హరికిషన్ సింగ్ సుర్జిత్ గారి నాయకత్వంలో ఆహార పదార్థాలను వైద్యం కొరకు సంబంధించిన మెడికల్ మందు సామాగ్రిని సేకరించి ప్రత్యేకంగా ఓడల ద్వారా తీసుకువెళ్లి క్యూబాకు సంఘీభావం ప్రకటించిన పరిస్థితి ఉందని తెలియజేశారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు క్యూబా పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుచున్నప్పటికీ అమెరికా ఎత్తివేయడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ వేదికైన ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలుకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఎన్నికలలోను అమెరికా ఓడిపోతుందని అయినా అమెరికా క్యూబా పై ఆంక్షలు ఎత్తి వేయడం లేదని అన్నారు. ఈరోజు అనగా అక్టోబర్ 29 ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ ఉన్నదని అందుకనే కార్మిక సంఘాల నాయకత్వంలోప్రపంచవ్యాప్తంగా క్యూబాకు సంఘీభావం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
అమెరికా సామ్రాజ్యవాదం విడనాడాలి
ఇప్పటికైనా అమెరికా సామ్రాజ్యవాదం విడనాడి క్యూబా ప్రజలకు ఆహార పదార్థాలు అందజేయాలని కోరారు క్యూబామీదనే కాకుండా అమెరికా ఈరోజు ఇజ్రాయిల్ కు మద్దతుగా ఉంటూ పాలస్తీనా ప్రజల మరణానికి కారణమవుతుందని, దాదాపు 45 వేల మంది ప్రాణాల పోగొట్టుకోవడానికి కారణమైందని అలాగే ఉక్రెయిన్ కు మద్దతు తెలియజేస్తూ రష్యా ప్రజల ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తుందని ఈ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు రాజశేఖర్ రామకృష్ణ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రవి, మెహమూద్ హమాలి వర్కర్ యూనియన్ నాయకులు బాలు ,షేక్షావలి తదితరులు పాల్గొన్నారు
Also Read తుంగ (గడ్డలు) ముస్తలతో శరీర దుర్వాసన మాయం
#America’s embargo on Cuba should be lifted