ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాతో పాటు వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉన్న వాటికి పరిష్కారం కనుగొనే లోపే కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అందువల్లనే వ్యాధుల నివారణ, నిరోధానికి మందు మొక్కలు పాత్రను గురించి వాటిపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించటం జరుగుతుంది..
అవగాహన లేక, ఔషధోపయోగాలు ఆచరణలో వెలుగులోకి రాకు సద్వినియోగం కాక ఔషధ గుణాలున్న ఎన్నో మొక్కలు మరుగునపడి కనుమరు గవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది.
మనకు అందుబాటులో ఉండి సుపరిచితమైన మందు మొక్కల్లో వావిలి ఒకటి. దీన్ని సంస్కృతంలో నిర్గుండి, ఆంగ్లంలో ‘ఫైవ్ లీవ్డ్ ఛాస్ట్ ట్రీ’ అని అంటారు. వెర్బినేసి కుటుంబానికి చెందిన దీన్ని శాస్త్రీయంగా ‘వైటెక్స్ నిగుండో’ అని పిలుస్తారు. దేశమంతటా అన్ని కాలాల్లో, పొలం గట్లు, కాలువ గట్లమీద, రోడ్ల పక్కన
దాదాపు 3 మీటర్ల ఎత్తు పొదగా, అయిదారు మీటర్ల చెట్లుగా పెరుగుతాయి.
ఆకులు చేతివ్రేళ్ల మాదిరిగా ఉండి 3 లేదా 5 ఆకులుగా ఉంటాయి. కొమ్మలు చివరన లేత నీలి రంగు పుష్పాలు గుత్తులుగా వస్తాయి. ఎండిన ఆకుల పై భాగం నల్లగా, అడుగుభాగం బూడిదరంగులో ఉంటుంది. వావిలి ఆకుల్లో సుగంధిత తైలం, పండ్లలో ఆర్గానికామ్లం, మాలిక్ ఆమ్లాలుంటాయి.
సుమారు 15 వావిలి ఆకుల్ని ముద్దగా నూరి ఒక గ్లాసు నీటిలో వేసి కాచి, వడగట్టాలి. దీనిలో ఒక స్పూను ఆముదం కలిపి రోజూ ఉదయంపూట సేవిస్తే నడుము నుంచి కాలువరకు వెనుకభాగంలో ఉండే నొప్పికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
నీడలో ఆరబెట్టిన వావిలి వేరు పై పట్టను పొడి చేసి, దీనికి కొద్దిగా నువ్వుల నూనె కలిపి రోజూ రెండు, మూడుసార్లు ఒక స్పూను చొప్పున తీసుకుంటే కీళ్ల వాతం, నడుము నొప్పి తగ్గుతాయి. పార్కన్ సోనిజం అనే వణుకురోగం లేదా కంపవాతంలో కూడా చక్కటి ప్రయోజనం సిద్ధిస్తుంది.
లేత వావిలి చిగుళ్లు నేతిలో వేయించి కూరగా వండి తింటే తరచుగా ముక్కు, నోటినుంచి రక్తం కారటం తగ్గుతుంది. వావి ఆకు రసాన్ని అంతే ప్రమాణం గల నువ్వుల నూనెలో కలిపి రసమంతా ఇగిరిపోయే వరకు కాచి, చల్లార్చి, వడగట్టగా వచ్చే నూనెను గజ్జి.. కామర, దురద లాంటి చర్మ వ్యాదుల్లో వాడటం వల్ల మంచి ఫలితముంటుంది.
చాలాకాలం నుంచి మానకుండా ఉన్న వ్రణాలపై వావిలాకు రసాన్ని పూస్తుంటే క్రిములు నశించి, చీము వంటి స్రావాలు తగ్గుతాయి. కీళ్ళు కండరాలు నొప్పిగా ఉన్న శరీర భాగంలో వావిలాకుల్ని వెచ్చజేసి కట్టు కడితే ఉపశమనం కలుగుతుంది. ఆకుల్ని మెత్తగా నూరి కణతలపై పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది.
వావిలాకులు వేసి మరగించిన నీటితో స్నానం చేస్తే కీళ్లు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, ఇరతత్రా ఒంటినొప్పులు తగ్గుతాయి.
వావిలి లో మంచి ఆయుర్వేదౌషధాలు..
ఈ నీటితో బాలింతలు స్నానం చేయటం వల్ల శరీర బడలిక, వంటినొప్పులు తగ్గి ఉల్లాసంగా, ఉషారుగా ఉంటారు. అలసట కూడా దరిచేరదు. రోజూ రెండుసార్లు పూటకు రెండు స్పూన్ల వావిలి ఆకు రసంలో చిటికెడు శుంఠి పొడి కలిపి తీసుకుంటుంటే ఆస్మా వ్యాధి తగ్గుతుంది.
వావిలి పూలను ఎండించి పొడిచేసి ఉదయం, సాయంత్రం ఒక స్పూను – చొప్పున పంచదార కలిపి సేవిస్తే నోట్లో నుంచి, ప్రేవుల్లోనుంచి వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
వేడి నీటిలో వావిలాకులు వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిల్వ చేసిన ధాన్యాన్ని పురుగులు, క్రిమికీటకాదుల బారినుంచి సంరక్షించేందుకు పలు ప్రాంతాల్లో వావిలి ఆకులు, మెంతి ఆకులను కలిపి నిల్వ ఉంచుతారు.
వావిలి చెట్టు లేత ఇగుర్లు, వెల్లుల్లి, మిరియాలు చూర్ణం సమంగా తీసుకుని మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి ఆరించి నిల్వయుంచుకుని – ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున సేవిస్తుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటి వాత వ్యాధులు తగ్గుతాయి.
నిర్గుండి తైలం లాంటి ఆయుర్వేదౌషధాలు, నొచ్చి తైలం, పీనిస తైలం వంటి సిద్ధ, హబ్ ఇ వజ్ యి రెహం లాంటి యునాని ఔషదాల తయారీలో వావిలిని ప్రధాన ఔషధంగా వాడతారు.
3 అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే వావిలి మొక్కను ఔషధంగా – సద్వినియోగపరచుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిద్దాంఉండ