తిరుమల లడ్డూపై..ఈవో రిపోర్ట్

Tirumala Laddu EVO Report

Tirumala Laddu EVO Report

కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపణులు రేకెత్తు తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీటీడీ ఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల లడ్డూ తయారీకోసం వాడుతున్న నెయ్యిని రద్దుచేసింది. కల్తీ నెయ్యిని ఉపయోగించారన్న దానిపై టీటీడీ స్పందించింది.

టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ .. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి తిరుమల దేవస్తానంలో చాలా మార్పులు తీసుకొచ్చామని అన్నారు. స్వామి వరి ప్రసాదానికి సంబంధించిన వివరాలను ఈవో వెల్లడించారు. అయితే టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యితో పాటుగా తిరుమల శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాలకు సంబంధించి .. వినియోగించే గో ఆధారిత ముడి సరుకులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నెయ్యి, బెల్లం, బియ్యం కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు.

భక్తుల అభిప్రాయాలను మనోభావాలను దెబ్బతీయ కూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని .. కమిటీ లో నిర్ధారణ లో తేలిన నివేదిక ప్రకారం.. ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వాడుకపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నామని భక్తులేవరు ఎటువంటి ఆంధోళన చెందవలసిన అవసరం లేదని..ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాలను , దైవత్వాన్ని కాపాడాల్సిన భాద్యత తీసుకుంటామన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూసుకుంటామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

Plzaap Instalationhttps://play.google.com/store/apps/detailsid=com.ravindra.news&pli=1

శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం వస్తున్న ప్రకంపనలపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాయుడు భక్తుల మనోబావాలను , శ్రీవారి పవిత్రతను కాపాడాలని ..ఈ కుట్ర వెనుక ఎంతటి వారున్నా వదిలి పెట్టొద్దని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇందుకోసం నిపుణుల కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.

వెనువెంటనే లడ్డూ నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని . గత కొన్ని సంవత్స రాలుగా లడ్డూ నాణ్యత లోపించిందని.. భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. తరువాత లడ్డు తయారీ కార్మికులతో మాట్లాడిన తరువాత, మొదటిసారిగా నెయ్యి శాంపుల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్‌కు పంపిచ్చామని అన్నారు . తిరుమల దేవస్తాననికి ఐదు కంపెనీలు స్వచ్ఛమైన నెయ్యి .. వారి ధరలు రూ. 320 నుంచి రూ. 411 మధ్య ఉన్నాయని, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్ మరియు ఏఆర్ డెయిరీ. ప్రాథమికంగా ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వచ్చాయన్నారు.

Also Read తిరుమల ప్రసాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శభరి ఫైర్

నూతన టెక్నాలజీ అందుబాటులోకి

నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని సరఫరాదారు లందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయా కంపెనీల నెయ్యిని పరీక్షించడానికి బయటి ల్యాబ్‌లకు పంపబడుతుందని, కల్తీ అని తేలితే కంపెనీలు సీజ్ చేస్తామని వారిని హెచ్చరించినట్లు తెలిపారు. స్వచ్ఛమైన పాల తో తీసిన నెయ్యి ఏస్-విలువ 98.05 మరియు 104.32 మధ్య ఉంటుందని , పరీక్షించిన నమూనాలు 23.22 & 116 నుండి గణనీయ వ్యత్యాసాలను కనుగొన్నామని తెలిపారు. టీటీడీ దేవస్తానం ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోవడం కూడా కల్తీ చేయడానికి దారులు దొరికాయని తెలిపారు. ఇకనుండి అటువంటిది జరుగకుండా..నుడబ్ రూ. 75 లక్షల నెయ్యి కల్తీ పరీక్ష పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ నూతన ల్యాబ్ ను డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top