వివిధ రకాల కారణాల వలన మన సాంప్రదాయ ఆహారాలు అయినటువంటి చిరుధాన్యాలను పక్కనబెట్టి వరి, గోధుమలు మన ఆహారంలో ప్రధాన భాగంగా చేసుకున్నాము. చిరుధాన్యాలతో పోల్చుకుంటే వరి, గోధుమలలో పోషకాలు సక్రమంగా ఉండవు. మనం ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన పోషకాలు చిరుధాన్యాలలోనే సమపాళ్ళలో ఉంటాయి. పోషకాలు సక్రమంగా లేని వరి, గోధుమలు మన ప్రధాన ఆహారాలు అయినం దువలన మనం రోగాల బారిన పడుతున్నాము. ఇలాంటి సమస్యలకు సరైన పరిష్కారం చిరుధాన్యాలే చూపించగలవు. కాని చిరుధాన్యాలతో వంటకాలు చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అనే అపోహ తోపాటు చిరుధాన్యాల ఆహారాలు రుచిగా ఉండవు అనే అపోహ కూడా ప్రజల మెదడులలో పాతుకుపోయింది. కాని ఇది వాస్తవం కాదు.
సక్రమంగా వంట చేసుకున్నట్లయితే చిరుధాన్యాలతో రుచి మరియు ఆరోగ్యం ఉంటుందని సెప్టెంబర్ 29, 30 అక్టోబర్ 1 తేదీలలో చిరుధాన్యాలతో వంటకాల తయారీ విధానంపై గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ (284వ వారం)లో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో జరిగిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో మూడవ రోజు పాల్గొన్న రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వేంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల నిపుణులు మిల్లెట్ రాంబాబు పాల్గొన్నారు.
శిక్షణా కార్యక్రమంలో చిరుధాన్యాలతో చేసుకోగలిగిన వంటకాలైనటువంటి ‘అరికల బిర్యానీ’, ‘అరికల పులిహోర’, ‘ఆర్థికల వడ’ ‘సామల సాంబర్ రైస్’, ‘సామల దోశలు’, ‘అండుకొర్ర ఇడ్లీ’ లాంటి వాటిని ప్రత్యక్షంగా చేసి చూపించారు. శిక్షణలో భాగంగా రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ విలువ జోడింపు యంత్రాలైనటువంటి, కారం మిషన్, టామోటా పల్పర్, చిరుధాన్యాల ప్రొసెసింగ్ యూనిట్, పుట్టగొడుగుల యూనిట్, వర్మి కంపోస్ట్ యూనిట్, చిన్న చిన్న యంత్రపరికరాలు, కట్టెగానుగ యూనిట్, గోశాలను సందర్శించి వారికున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం ఔత్సాహికులకు సర్టిఫికెట్లు అందజేశారు.
చిరుధాన్యాలతోనే ఆరోగ్యం : మిల్లెట్ రాంబాబు ..
Also Read తిరమందార్ల స్పెషల్ బంగి ఉండలు – లివర్ పచ్చడి
ప్రస్తుతం మన సమాజాన్ని గమనించినట్లయితే మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. సమాజంలోని అనారోగ్యాలకు వివిధ కారణాలు ఉన్నా గాని అందులో ప్రధానమైన కారణం మన ఆహారం. గతంలో అంటే వరి, గోధుమలు రాకమునుపు అందరూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు. కాని వివిధ రకాల కారణాల వలన మన ఆహారంలో వరి మరియు గోధుమలు చేరి చిరుధాన్యాలను పక్కకు నెట్టి ఈ రెండు ధాన్యాలే ప్రధాన ఆహారంగా మారినాయి. వరి మరియు గోధుమలలో మనిషికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమపాళ్ళలో ఉండవు.
చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు
మనకు అవసరమైన పోషకాలు ఉన్న ధాన్యాలు చిరుధాన్యాలు. కాని వరి మరియు గోధుమలు తినడానికి అలవాటు పడిన ప్రజలు చిరుధాన్యాలు సరిగ్గా రుచిగా ఉండడం లేదు అని వీటిని తమ ఆహారంలో చేర్చుకోలేపోతూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. కాని శ్రద్ధతో వంట చేసుకున్నట్లయితే చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చని వీటితోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరుధాన్యాల నిపుణులు మిల్లెట్ రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగలు, అరికలు, సామలు, ఊదలు మరియు అండుకొర్రలు లాంటి అన్నీ చిరుధాన్యాల కిందే వస్తాయి. కాని మిగతా వాటితో పోల్చుకుంటే సిరిధాన్యాలైన కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు మరియు అండుకొర్రలలో రోగాలను నయం చేయగల శక్తి ఉన్నది కాబట్టి ఈ సిరిధాన్యాలను మన ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఆరోగ్యంగా జీవనాన్ని కొనసాగించవచ్చు. ఈధాన్యాలతో వంటలు చేసుకోవడం ఇబ్బదికరమని భావిస్తున్నారు. అనేకమంది దానికితోడు చిరుధాన్యాల వంటలు రుచిగా ఉండడం లేదంటున్నారు. ఇది సరైన అభిప్రాయం కాదు. చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలను అత్యంత రుచిగా ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చని వివరిస్తూ మొదటి రోజు కొన్ని రకాల వంటకాలు ‘అండుకొర్ర పాయసం’. ‘ఊదల, రాగి సంకటి’, ‘సామల రైస్’ లాంటి వాటిని ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ విపులంగా వివరించారు. #Tastehealthwithmillets #millets #korralu #drkhadarvali
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..