వృద్ధుల పెన్షన్ రూ. 2750కి పెంపు
ప్రతి నెలా రూ.130.44 కోట్ల అదనపు వ్యయం.
రూ. 23 వేల కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు ఆమోద ముద్ర
సీఎం జగన్ నేతృత్వంలో కేబినేట్ భేటీ కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాది జనవరి నుంచి వృద్దుల పెన్షన్ రూ.2750కి పించుతూ ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రాష్ర్ట ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.130.44 కోట్ల అదనపు భారం పడనుంది. తాజా పెంపుతో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2500 నుంచి రూ.2750కి పెరగనుంది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 62 లక్షల పెన్షన్ దారులపై ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా రూ.250 చొప్పున పెన్షన్ మొత్తాన్ని రూ.3వేలకు పెంచుకుంటూ పోతామంటూ ఎన్నికల్లో సీఎం జగన్ హామీ మేరకు కేబినేట్ పెన్షన్ పెంపు నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2250కు, రూ.2500కు రెండు విడతలుగా పెంచి ప్రస్తుతం మూడో దశలో పెంపుకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా డిసెంబరులో ఇవ్వనున్న 2.43 లక్షల మందితో కలుపుకుంటే మొత్తం పెన్షనర్ల సంఖ్య 64.74 లక్షలకు చేరినట్లు కేబినేట్ వెల్లడించింది. దీంతో పెన్షన్ల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1786 కోట్లకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో గత టీడీపీ ప్రభుత్వంలో నెలకు పెన్షన్లు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లుగా ఉన్నట్లు మంత్రులు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ర్టంలో కొత్తగా రూ. 23 వేల కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు ఆమోద ముద్ర వేసింది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదించిన కొత్త పెట్టుబడులకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.
– నవరత్నాలు అర్హులైన పేదలందరికీ సంక్షేమపథకాలు అమల్లో భాగంగా వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా వీటి మంజూరుకు కేబినెట్ ఆమోదం.
అర్హుడైన ఏ ఒక్క లబ్ధిదారుడూ మిగిలిపోకూడదన్న తపనతో పొరపాటున ఏ ఒక్కరైన మిగిలిపోతే వారికి మరో అవకాశం కల్పించి, పరిశీలించి అర్హులైన వారికి అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
డిసెంబరు 27న 2.51 లక్షల మందికి రూ.403 కోట్ల మేరకు లబ్ధి.
దీంతో పాటు అదనంగా 2.63 లక్షల పెన్షన్లు, 44,543 రైస్ కార్డులు, 14,441 ఆరోగ్యశ్రీ కార్డులు, 14,531 ఇళ్ల పట్టాలు, రూ.65 కోట్ల విలువైన సస్పీసియస్ అకౌంట్‌లో ఉన్న బీమా క్లెయింలు మంజూరు.
– వ్యవసాయ,సహాకార, మత్స్య శాఖలలో 2022 మే, జూన్ నెలలో అమలు చేసిన సంక్షేమక్యాలెండర్‌కు కేబినెట్ రాటిఫికేషన్.
– ఖరీప్ 2022 కు సంబంధించి రాష్ట్రంలో గతంలో అమలు చేసిన సాగునీటి విడుదల షెడ్యూల్‌కు కేబినెట్ రాటిఫికేషన్.
సకాలానికి నీటిని విడుదల చేయడం ద్వారా సరైన కాలానికే పంటలు చేతికందాయని, తుపాను బారినుంచి పంటలను కాపాడుకునేందుకు ఈ షెడ్యూల్ ఉపకరించిందని పేర్కొన్న కేబినెట్.
మాండూస్ తుఫాను ప్రభావం చూపకముందే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో 80శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తి చేయగలిగామని కేబినెట్‌కు వివరించిన సంబంధిత శాఖ అధికారులు.
– సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, హైడ్రో ప్రాజెక్ట్స్‌ను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ –2022 ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
ఒక్కో మెగావాట్‌కు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనున్న కంపెనీలు.
రైతుల నుంచి భూములు తీసుకుంటే లీజు రూపేణా ఎకరాకు రూ.30వేల చొప్పున ఏడాదికి లబ్ధి.
ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెంపు ద్వారా రైతుకు మరింత లబ్ధి.
– అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట, విజయనగరం జిల్లాలో రైవాడ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- వైఎస్‌ఆర్ జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
– అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు వద్ద 1350 మెగావాట్ల సామర్ధ్యంతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరుకు కేబినెట్ ఆమోదం.
– సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన వైఎస్‌ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
2 మిలియన్ టన్నుల ఉత్పతి. భవిష్యత్తులో మరో 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు ఆమోదం.
రూ.8,880 కోట్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
– పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు ఫేజ్ –1లో పనులు పూర్తయిన స్కూళ్లలో అత్యాధునిక బోధన ఉపకరణాలు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
హైస్కూల్స్ పరిధిలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), పౌండేషన్, పౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
6 వతరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిగతిలో దాదాపు 15,694 స్కూళ్లలో 30,230 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు.
దీనికోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
1వతరగతి నుంచి 5వతరగతి వరకు ప్రతి స్కూళ్లో ఒక టీవీ ఏర్పాటు.
పదివేల స్మార్ట్ టీవీలు. దాదాపు రూ.50 కోట్ల ఖర్చు.
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన సింధియా, సెయింట్ జేవియర్స్, బాంబే స్కాటిస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్ధల్లోనే ఇలాంటి సౌలభ్యం.
– ప్రభుత్వ స్కూళ్లలో 8వతరగతి విద్యార్ధులకు ఇరవైనాలుగు గంటలపాటు ఉపయోగపడే విధంగా ట్యాబులు, ఇ–కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని 21 డిసెంబరునాడు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రభుత్వం.
ఈ కార్యక్రమానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
4.6లక్షల మంది 8వతరగతి చదువుతున్న విద్యార్ధులతో పాటు 60 వేల మంది 8వతరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉచితంగా శామ్‌సంగ్ ట్యాబులు పంపిణీ.
ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకపోయినా, ట్యాబును ఇంటిలో కూడా వినియోగించుకునేలా, ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్ అందుబాటులో ఉండేలా సెక్యూర్ డిజిటల్ కార్డుతో బైజూస్ సంస్ధ కంటెంట్‌తో ఇస్తున్న ట్యాబులు.
దీనికోసం రూ.668 కోట్ల వ్యయం.
దీనితో పాటు రూ.778 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ ఉచితం.
మూడేళ్ల వారెంటీతో ట్యాబులు పంపిణీ.
– పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో కొత్తగా ఏర్పాటు చేయనున్న పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలకు కేబినెట్ ఆమోదం. 3 బోధన, 10 బోధనేతర సిబ్బందితో కలిపి 13 పోస్టుల భర్తీతో పాటు సుమారు రూ.10 కోట్లతో కళాశాల ఏర్పాటు.
2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్న తరగతులు.
– పశు సంవర్ధకశాఖ పరిధిలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ( తణుకు), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి (గోపాలపట్నం), విశాఖపట్నంలో రెండు రేడియోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
అవుట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా నియమించాలని నిర్ణయం.
– డాక్టర్ వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో సవరణలకు మంత్రిమండలి ఆమోదం.
– నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాలలో 52 బోధనాసిబ్బంది, 56 బోధనేతర సిబ్బందితో సహా 108 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
గతంలో మేకపాటి రాజమోహనరెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (మెరిట్స్)లో ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తాజాగా ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదినక నియమించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్ధం మెరిట్స్ కాలేజీని ప్రభుత్వానికి ఉచితంగా అందజేసిన మేకపాటి కుటుంబం.
– నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా వైఎస్‌ఆర్ పశుబీమా పథకం(లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీంను) పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం.
గతంలో వైఎస్‌ఆర్ పశునష్ట పరిహార పథకం పేరుతో ఉన్న ఈ స్కీంను ఇకపై వైఎస్‌ఆర్ పశుబీమాపథకంగా మార్పు.
– చిత్తూరు జిల్లా సదుంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల సామర్ధ్యం నుంచి 50 పడకల సామర్ధ్యానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
చిత్తూరు జిల్లా సదుంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల సామర్ధ్యం నుంచి 50 పడకల సామర్ధ్యానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
ఇందులో భాగంగా 18 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ గైడ్‌లైన్స్ మేరకు… అత్యుత్తమ భోధన అందించే కార్యక్రమంలో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 4 ప్రొఫెసర్, 3 అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
– వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడులో భాగంగా ఏపీఎంఎస్‌ఐడీసీ కింద చేపట్టిన పనులకు కేబినెట్ ఆమోదం.
ఇందులో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న, ఇప్పటికే వినియోగంలో ఉన్న వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ బ్లాకులు, కేన్సర్ కేర్ సెంటర్ నిర్మాణాల్లో నాడు నేడు పనులకు కేబినెట్ ఆమోదం.
– రాష్ట్రంలో అత్యాధునిక వైద్య చికిత్సలు(టెర్షియరీ కేర్) కోసం.. 16 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రైవేట్ రంగంలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
ప్రతి ఆసుపత్రిలో కనీసం వంద పడకలు ఏర్పాటు చేయడంతో పాటు రూ.100 కోట్లు పెట్టుబడి ఉండాలి. వీటిలో 50శాతం పడకలు ఆరోగ్యశ్రీ కేటాయించాలి.
– కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య జిల్లా రాయచోటిలలో మైనార్టీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లలో కొత్త విభాగాలు ఏర్పాటుతో పాటు, ఒక్కో ఐటీఐకు 20 బోధన మరియూ బోధనేతర పోస్టుల చొప్పున 40 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
తొలిసారిగా కొత్తగా అందుబాటులోకి రానున్న సోలార్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులు.
– సమగ్ర భూసర్వే కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో సర్వే కోసం… సర్వే సెటిల్మెంట్ మరియూ రెవెన్యూ శాఖ సేవలను రీసర్వే పనుల కోసం వినియోగించుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీస్ యాక్టు –1965, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్టు –1955 సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– బాపట్ల కేంద్రంగా బాపట్ల అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
1301.68 చదరవు కిలోమీటర్ల పరిధిలో 2 అర్భన్ లోకల్ బాడీస్, 101 గ్రామాలు, 9 మండలాలతో బాపట్ల అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు.
– తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
– విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు ఆమోదం.
– నరసరావుపేట కేంద్రంగా పల్నాడు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
8 పట్టణ స్ధానిక సంస్ధలతో పాటు 28 మండలాల పరిధిలో 349 గ్రామాలతో 7281.31 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటు.
– పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆప్ చిల్డ్రన్ టు ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ –2010కు సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
ఆంధ్రప్రదేశ్ రైట్ ఆప్ చిల్డ్రన్ టు ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ –2010కు రూల్ నెంబరు 30ను జత చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
రూల్ నెంబరు 30 ప్రకారం అకడమిక్ వ్యవహారాలకు తప్ప బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించడం నిషేధం.
ఉపాధ్యాయులను బోధనపనులకు మాత్రమే వినియోగించడం వలన పిల్లలకు మెరుగైన బోధనను అందించగలుగుతారు అన్న విద్యావేత్తల అభిప్రాయల మేరకు… ఈ నిర్ణయం.
దీంతో ఉపాధ్యాయులను కేవలం బోధన సంబంధమైన పనులలో మాత్రమే వినియోగించేందుకు నిర్ణయం.
గతంలో ఉపాధ్యాయులు నిర్వర్తించిన బోధనేతర పనుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.3 లక్షల మంది సచివాలయ సిబ్బంది.
దీంతో ఉపాధ్యాలను బోధనేతర పనుల నుంచి మినహాయించి పూర్తిగా అకడమిక్ వ్యవహారాలకే పరిమితం చేయాలని నిర్ణయం.
– నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీలో వివిధ కేటగిరీల కింద 55 అదనపు పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్టు –1971 సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
– ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 5 జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
– గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెం గ్రామంలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్(మదర్ అండ్ చైల్డ్ కేర్) ఆసుపత్రి నిర్మాణానికి విశ్వమానవ సమైక్యతా సంస్ధకు 7.45 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
– అనంతపురములో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్యశాల ఉన్నతీకరణ కోసం అవరసమైన 8.32 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
– ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
– వైఎస్‌ఆర్ జిల్లా జమ్ములమడుగు మండలం గండికోటలో విండ్ టర్బైన్స్ ఏర్పాటుకు ఐఓసీఎల్‌కు 15 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
– తిరుమల తిరుపతి దేవస్ధానంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్‌ఓ) నియామకానికి కేబినెట్ ఆమోదం.
– రాయలసీమ జిల్లాల్లో మరోసారి పాలవిప్లవం.
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు.
అమూల్ ద్వారా మళ్లీ చిత్తూరు డైయిరీ కార్యకలాపాలు
చిత్తూరుతో పాటు రాయలసీమ జిల్లా పాడి రైతులకు మేలు చేకూరేలా.. అతిపెద్ద సహకార డెయిరీ అయిన అమూల్ ద్వారా మరలా చిత్తూరు డెయిరీ కార్యకలాపాలు.
గతంలో మూసివేతకు గురైన చిత్తూరు డెయిరీ భూములను 99 ఏళ్లపాటు అమూల్‌కు లీజు ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం.
ఏటా రూ.1 కోటి ప్రభుత్వానికి లీజు రూపంలో ఆదాయం.
దశలవారీగా పాలసేకరణ చేస్తూ… మొత్తంగా 4 లక్షల లీటర్లు చేరనున్న పాలసేకరణ.
అమూల్ ప్రవేశం ద్వారా ఇప్పటికే రైతులకు మెరుగైన రేట్లు
లీటరుకు అదనరంగా రూ.5 నుంచి రూ.20వరకూ వరకు రైతులకు అదనపు ఆదాయం.
చిత్తూరు డెయిరీ అంశంపై క్యాబినెట్లో చర్చ.
తన సొంత ప్రయోజనాలకోసం చిత్తూరు డెయిరీని చంద్రబాబు మూసివేశారని కేబినెట్లో చర్చ.
హెరిటేజ్‌కోసం చిత్తూరు డెయిరీ ఉసురు తీశారన్న కేబినెట్ ఆ తర్వాత పాడిరైతులను దోచుకున్నారని వ్యాఖ్య.