DSP ప్రణీత్ రావు సస్పెన్షన్‌లో సంచలన విషయాలు

Suspension of DSP PraneetRao

Suspension of DSP PraneetRao

పోలీస్ శాఖకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అత్యంత కీలకం. అలాంటి ఇంటలిజెన్స్ వ్యవస్థ అయిన SIB లో డీఎస్పీగా పని చేశాడు

ప్రణీత్ రావ్. SIB లో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పలువురు సిబ్బందిని తన టీమ్ గా నియమించుకొని ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేశాడు..

డేటా ఆనాలసిస్ పేరుతో ఎస్ ఐ బి కార్యాలయంలోని ఒక రూమ్ మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వచ్చాడు..

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కీలక నేతలు బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి నేతల ఫోన్లను టాప్ చేసినట్టు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి.

ఎస్ఐబీ కార్యాలయంలో ఉన్న లాగర్ రూమ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ప్రభుత్వం మారగానే ప్రణీత్ రావు చెరిపేశారు.

ఈ లాగర్ రూమ్ లో ఏ ఏ లీడర్ కు సంబంధించిన ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో, ఏ సమయాల్లో ట్యప్ చేశారో వంటి వివరాలు అందులో దాగి ఉండేవి.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎస్ ఐ బి కార్యాలయంలో ఉన్న ఈ రికార్డులను అన్నిటిని ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు.

కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి మరి రికార్డులను తొలగించాడు. సాధారణంగా ఈ రికార్డులు మొత్తం కూడా హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి ఉన్నాయి.

ఆ హార్డ్ డిస్క్ల ధ్వంసంతోపాటు లాప్టాప్ లో ఉన్న వివరాలను సైతం ప్రణీత్ రావ్ తొలగించాడు. తాను చేసే పని ఎక్కడ సీసీ కెమెరాలు రికార్డు కాకుండా ఉండేందుకు ఒక ఎలక్ట్రిషన్ సహాయం తీసుకున్నాడు.

సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఈ విధంగా మొత్తం 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి.

ఈ వ్యవహారం పైనే అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ రావ్ పోస్టింగ్ పైనా అనేక వివాదాలు చుట్టుముట్టాయి.

2007 బ్యాచ్ ఎస్ఐగా ఉన్న ప్రణీత్ కు అనది కాలంలోనే డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన విధానం పైన కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి..

ఎస్ఐగా వచ్చి అనతి కాలంలోనే డీఎస్పీ గా

ఎస్ఐగా ఉద్యోగం వచ్చిన అనతి కాలంలోనే డీఎస్పీ గా ఆక్సిలరీ ప్రమోషన్ పొందటం ఆశమాశి వ్యవహారం కాదంటున్నారు’

అధికారులు.. 2007లో ఎస్సైగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నల్గొండ జిల్లాలోని ప్రణీత్రావు పనిచేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

రూల్ ప్రకారం సీఐగా ఉద్యోగం వచ్చినప్పటికీ ఏడాది తిరిగేలోపే డిఎస్పీగా ఆక్సిలరీ ప్రమోషన్ను పొందాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రణీత్ రావు ఎస్ఐబి లో చేరాడు. మావోయిస్టులకు సంబంధించిన ఆపరేషన్స్ లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషించాడని ఆయనకు రివార్డులు కూడా ఇచ్చారు. దీంతో ఆక్సిలరీ ప్రమోషన్ ను ప్రణీత్రావుకు కట్టబెట్టింది గత ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆయన పోస్టింగ్ పైన వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రణీత్ రావు పై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ అతన్ని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా డిసిఆర్బిలో ప్రణీత్ రావ్ పనిచేస్తున్నాడు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లరాదని జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top