శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సున్నుపెంటకు చేరుకున్నారు.
సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేరుకోగానే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ , SP శ్రీ కె. రఘువీర్ రెడ్డి లు ఘన స్వాగతం పలికారు.
ద్రౌపతి మురుమం ముందుగా సుండుపెంట హెలిపాడ్ నుంచి నేరుగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొనున్నారు. ఆలయ ముఖ మండపం వద్ద రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఆలయ ఈవో లవన్న అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చత్రపతి శివాజీ మండపానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం తిరిగి సుండిపెంట హెలిపాడ్ నుంచి హైదరాబాద్ కు వెళ్ళనున్నారు.