విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా

FB_IMG_1672161791455.jpg

శ్రీశైలంలో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్ పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి క్షేత్రపరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణి చేశారు. పాఠశాలలో 8 వతరగతి చదువుతున్న సుమారు 135 మంది విద్యార్థి,విద్యార్థునిలకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ట్యాబ్ లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ విద్యార్థుల కోసం విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి లాంటి వినూతన కార్యక్రమాలు చేపట్టారని వీటి ద్వారా ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా విద్యార్థులందరూ సమానంగా అభ్యసించే అవకాశం కలిగిందన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్దారని విద్యార్థులు అందరూ కూడా సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ బాగా చదవాలని విద్యార్థులని దివించారు అనంతరం శ్రీగిరి కాలనీలోని 9వ వార్డులో 58 లక్షలతో సుమారు 600 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా త్వరగా రోడ్డు పనులు చేయాలని కాంట్రాక్టర్ కి ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిని ఆదేశించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top