కుమారి ఆంటీని కలిసిన సోనూ సూద్ – Sonu Sood

SonuSood Meets KumariAunty

SonuSood Meets KumariAunty

  • కుమారి ఆంటీని కలిసిన సోనూ సూద్

HYD : హైటెక్ సిటీ సమీపంలో రోడ్డు ప్రక్కన చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతూ .. వ్యాపారం చేసుకునే కుమారి ఆంటీ దగ్గరకు బలీవుడ్ నటుడు సోనూ సూద్ వెళ్ళడం సంచలనం రేకెత్తింది.

సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీకి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈరోజు శుక్రవారం 05-07-2024 నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కుమారి ఆంటీ నడుపుతున్న ఫుడ్ స్టాల్ ను సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి కుమారి అంటితో చాలా సేపు ముచ్చటించారు. సోనూ సూద్ ను చూడగానే ఆయన అభిమానులు , ప్రజలు , ఎగబడ్డారు . ఎందునకంటే సోనూ సూద్ కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడే .. అతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ నటుడుడు సోనూ సూద్ కుమారి ఆంటీని కలిసిన వీడియో.. త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో X పోస్ట్ చేశాడు.

తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నా డు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని కుమారి ఆంటీని సోనూ సూద్ అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది. తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ.. సోనూ సూద్ సామాన్య వ్యక్తిలా మాట్లాడుతూ.. న‌వ్వులు పూయించాడు . సోనూసూద్‌. అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడుగ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని కుమారి ఆంటీ చెప్పడంతో .. ఆ ఆ ఈ రోజు నాకు లాట‌రీ త‌గి లింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ చమత్కారంగా మాట్లాడాడు. కుమారి ఆంటీ మాట్లాడుతూ.. మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్.. నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిన మధుర క్షణాలను మారిచిపోలేనని అన్నారు. మీకు ఎంత అన్నం పెట్టినా.. త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది.

నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది’ అంటూ తన ఫుడ్‌తో పాపులర్ అయిపోయింది కుమారి ఆంటీ.

అయితే తనకి వచ్చిన పాపులారిటీ ఇప్పుడు కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. సెలబ్రిటీ అంటే.. అదేదో యూట్యూబ్‌లో..

ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదు.. అంతకు మించి. యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయి దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో..

కుమారి ఆంటీ.. వరుసగా టీవీ షోలు

హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ.. వరుసగా టీవీ షోలు చేస్తుంది. రీసెంట్‌గా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపించింది.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

ఆ తరువాత స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయిన ‘బీబీ ఉత్సవం’స్పెషల్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లింది. వెళ్తూ వెళ్తూ.. తన చేతి వంట రుచిని చూపించింది కూడా.

రీసెంట్‌గా జీ తెలుగులో ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్‌లో అతిథి పాత్రలో కనిపించింది. మొత్తానికి ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు..

మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నింటినీ చుట్టేసి.. ఫుల్ బిజీగా మారిన కుమారి ఆంటీ.. ఇక దుకాణం సర్దేసి ఫుల్ టైప్ నటిగా మారబోతుందా అంటే..

అబ్బే అదేం లేదు.. నా ఉపాధి ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవుతా.. ఖాళీ టైంలో మాత్రమే షోలు చేస్తుంటానంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top