- చెట్ల నరికివేతతో గ్రామంలో అలజడి..
- అడ్డుకున్న స్థానిక రైతులు..
- 8 ఏళ్లుగా పంటలకు నోచుకోని పొలాలు..
- ముంపు పొలాలపై నేతల కన్ను..
- ఆధిపత్య పోరుతో ‘రైతుల’ అవస్థలు..
ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన సిద్దేశ్వరం, జానాలగూడెం, బలపాల తిప్ప ప్రాంతాల్లో మరోసారి అలజడి మొదలైంది. శ్రీశైలం బహుళార్ధక సాధక ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కొందరు తీగెల వంతెన ప్రకటనతో మళ్లీ స్వగ్రామం చేరుకున్నారు. పెత్తనం చెలాయించాలనే ఉద్దేశంతో రెండ్రోజుల క్రితం 30 మంది స్థానికేతరులు చేపట్టిన కంపచెట్ల నరికి వేతను స్థానికులు అడ్డుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. 145 సెక్షన్ అమలులో ఉన్నా.. ఇలాంటి చర్యలకు పాల్పడడం పలు విమర్శలకు దారితీస్తోంది.
అసలు విషయం ఏమిటంటే..
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం లోని ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన సిద్ధేశ్వరం రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలోని జానా లగూడెంలో శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దాదాపు 250 కుటుంబాలుండేవి. ఇక్కడ 1200 ఎకరాల నీటి మునక. 170-180 ఎకరాల ఇతర ప్రభుత్వ భూములుండేవి. వీటిని అక్కడి రైతులంతా సాగు చేసుకునేవారు. 1982లో శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ భూములు తీసుకున్నారు. పరిహారం కూడా అందజేశారు. వెలు గోడులోని గుండాలనట్టు వద్ద పున రావాసం కల్పించారు. కానీ అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడలేదు.
ప్రాజెక్టు నిర్మాణం తర్వాత చెంచులు 15 కుటుంబాలు, మిగతా సామాజిక వర్గాలకు చెందిన మరో 55 కుటుంబాలు ఇక్కడే ఉండి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని కృష్ణానదిలో చేపల వేట, పొలాలు సాగు చేసుకుంటు న్నారు. కాలక్రమేణా ఈ గ్రామం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా మారింది. 1993లో 15 చెంచులకు మిగతా సామాజిక వర్గాలకు 3 నుంచి 4 ఎకరాల చొప్పున నక్సల్స్ పంచారు. నాటి నుంచి వారంతా పంటలు సాగు చేసుకుంటు న్నారు. అయితే, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కొందరు తిరిగొచ్చి ఈ పొలాలు తమవని గొడవలు సృష్టిస్తున్నారు..
సమస్య ఇలా ప్రారంభం..
2019కి కంటే ముందు నందికొట్కూరు ఇన్చా ర్జిగా మాండ్ర శివానంద రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో పొలాల రగడ ప్రారంభమైంది. తద నంతరం అధికారం చేపట్టిన వైసీపీ హయాంలో యువ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరు లుగా చెప్పుకుంటూ కొందరు పొలాలను ఎవరూ వేసుకోకుండా అడ్డుకున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం అక్కడి రైతులకు బాసటగా నిలిచారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సమస్యను పరిష్కరిం చాలని ఆయన బాధిత రైతులతో కలిసి కలెక్టర్ను కలిసి విన్నవించారు.
కంపచెట్ల తొలగింపు పనులు
ఈ క్రమంలో జూన్ 25న సిద్దేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్ప వద్ద కంపచెట్ల తొలగింపు పనులు ప్రారంభమ య్యాయి. ఇది మింగుడు పడని మాండ్ర అనుచ రులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయిదాటుతుండ టంతో, పోలీసులు జోక్యం చేసుకొని పనులునిలిపివేయించారు. అప్పటి నుంచి అక్కడ ఎవరూ కంపచెట్లను తొలగించే పనులు చేయలేదు. అయితే రెండ్రోజుల క్రితం కర్నూలు, పెసరవాయి, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది చెట్ల నరికివేతకు పూనుకున్నారు. గమనించిన స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం. అందించారు. వెంటనే ఎస్ఐ, తహసీల్దార్లు తమ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 145 సెక్షన్ అమలులో ఉన్నందున ఎవరూ కంపచెట్లు కొట్టరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నట్టుండి చెట్ల నరికివేత వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు విన్పిస్తు న్నాయి. ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో నని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్