నిండు కుండలా సిద్ధాపురం చెరువు
బుడ్డా వెంగళరెడ్డి సాగర్ (సిద్ధాపురం )చెరువుకు జలకళ
దక్షిణ వైపు అలుగు ఎల్లింది,
ఉత్తరం వైపు అలుగు ఏక్షణంలోనైన ఎల్లబోతోంది.
నల్లమల అరణ్యంలోని క్యాచ్ మెంట్ ఏరియా నుంచి గరిగలమ్మ, రాళ్ళ వాగులు ఉదృతం పారుతూ సిద్ధాపురం చెరువులో చేరుతోంది.
రెండు కార్ల కు ( పంటలకు ) సాగునీరు అందుతుందన్న ఆనందంలో రైతులు
ప్రభుత్వానికి రూ. 65 లక్షలు విద్యుత్ బిల్లులు ఆధా…
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు (బుడ్డా వెంగళ రెడ్డి జలాశయం) జలకళ సంతరించుకుంది
నల్లమల అరణ్యంలోని పెచ్చేరువు, బైర్లూటి అటవీ రేంజ్ పరిధిలోని గరిగలమ్మ వాగు (గాలేరునది ), రాళ్ళవాగులు ఉదృతంగా పారుతూ.. సిద్ధాపురం చెరువులో వరద నీరు పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ .. సిద్ధాపురం చెరువు నిండు కుండలా మారింది. ఇప్పటికే చెరువు దక్షిణం వైపు అలుగు ఎల్లింది (పారుతుంది ) ఏక్షణంలోనైనా ఉత్తరం వైపు అలుగు ఎల్లనుంది (పారనుంది) .
నల్లమల అరణ్యంలోని కొండవాగుల నీటి ప్రవాహన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో పెద్ద తూము, చిన్న తూములను ఎత్తి దిగువకు నీరు వధులుతున్నారు.
ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ, సంజీవనగర్ తాండా, సిద్ధాపురం, వెంకటాపురం, కృష్ణాపురం, శ్రీపతిరావుపేట, ఇందిరేశ్వరం, పెద్దఅనంతాపురం, సిద్దేపల్లె, ముష్టపల్లె, బ్రహ్మనంతాపురం, నల్లకాలువ, కొత్త రామాపురం, బానుముక్కల, కరివేన, ఆత్మకూరు గ్రామాలలోని సుమారు 20 వేల ఎకరాలు సిద్ధాపురం చెరువు ఆధారంగా సాగు అవుతోంది.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
మరో 5700 ఎకరాలకు అదనంగా సాగునీరు అందించేందుకు వెంకటాపురం గ్రామం పై బాగానా కొత్త పంట కాలువ చిన్న తూము ఆధారంగా నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో హామీ తీసుకున్నారు, ఆ కాలువ మంజూరు చేయిస్తే సిద్ధాపురం చెరువు క్రింద 25700 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.
బ్రిటిష్ పాలనలో ప్రకాశం జిల్లా చీరాల, స్టూవర్టుపురం ప్రాంతాలలో అరెస్ట్ అయిన దొంగలను సిద్దాపురం గ్రామం.. ఓపెన్ జైలు గా దొంగలను ఒక చోటుకు చేర్చి వారు దోపిడీ, దొంగతనాలు చేయకుండా వారు పనులు చేసుకునేందుకు పొలం, ఇల్లు నిర్మించి 1000 ఎకరాల ఆయకట్టు సాగునీటీకి వర్షాధారంపైనే సిద్ధాపురం చెరువు నిర్మించారు. వర్షాకాలంలో ఒక్కసారి చెరువు నిండితే మూడేళ్లు కరువు ఉండేది కాదు.
బుడ్డా వెంగళ రెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకంగా నామకరణం
దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి, సిపిఎం నేత టీ రామకృష్ణ, రైతు నాయకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి, వి. వెంగయ్య తదితరులు 1985 లోనే సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలనీ ఎన్నో పోరాటాలు చేయగా ప్రభుత్వం స్పందించి..వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఏడాదికి రెండు సార్లు ఒక TMC నీరు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్ధాపురం 2004 లో ఎత్తిపోతల పథకానికి శంఖు స్థాపన చేయగా, మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప రెడ్డి 70% పనులు పూర్తీచేయగా … 2014 న చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం (బుడ్డా వెంగళ రెడ్డి ఎత్తిపోతల పథకం గా నామకరణం చేసి ) ప్రారంభించారు.
Plz Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సిద్ధాపురం చెరువు పెద్దది. 5 కిలోమీటర్లు చెరువు కట్టపొడవు, 22 అడుగు లతో అర TMC కేపాసిటితో, వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఏటా ఒక TMC నీరు ఎత్తిపోయడం వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 65 లక్షల కరెంట్ బిల్లు భారం పడుతోంది.
ఈ ఏడాది కేవలం వర్షం ఆధారంగా సిద్ధాపురం చెరువు నిండి ప్రభుత్వానికి 65 లక్షల కరెంట్ బిల్లులు ఆధా అయ్యాయి అని చెప్పవచ్చు. అలాగే ఆత్మకూరు పట్టణంతో పాటు మండలంలోని 75 శాతం గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి రైతుల వ్యవసాయ బోర్లకు నీరు అంది మెట్ట పంటలు కూడా పండిస్తున్నారు. ఈ ఏడాది సిద్ధాపురం చెరువు వర్షం తో నిండడంతో ఆత్మకూరు మండలంలో సాగు, తాగు నీటి కష్టాలకు, ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు ఆదా పరిస్కారం లభించినట్లు అయింది.