మధుమేహాన్ని తగ్గించే మందు మొక్క పొడపత్రి..
మనదేశంలో ఏటా మధుమేహం (డయాబెటిస్ / షుగర్)తో బాధపడే ā వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి
ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం, జీవనశైలి, అనువంశికత, దీర్ఘకాలంగా కొన్ని ఔషధాలు సేవించడం, మానసిక ఒత్తిళ్ళు వగైరా కారణాలవల్ల మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుతోంది.
దీని నివారణకు నేడు ఎన్నో ఔషధాలను ఉపయోగిస్తున్నప్పటికీ దీర్ఘకాలం వాడాల్సి రావడం వల్ల కలిగే దుష్పరిణామాలతో పాటు, వ్యాధి ప్రభావంతో నేత్ర, చర్మ, మూత్రపిండాలు, మెదడు తదితర అవయవాలు రోగ గ్రస్థం కాకుండా అవి ఏ మేరకు అరికట్టగలుగుతాయనే విషయంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ఈ నేపధ్యంలో ప్రస్తుతం చక్కెర వ్యాధిని నియంత్రించగలిగే మందు మొక్క పొడపత్రిని గురించి తెలుసుకుందాం.
పొడపత్రి చెట్లు, కంచెల మీద లేదా ఏ ఆశ్రయం దొరక్కపోతే నేలమీద కూడా పాకే తీగజాతి మొక్కలు. పత్రాలు కణుపునకు రెండు చొప్పున దాదాపు అందాకారంలో తమలపాకుల్ని పోలి ఉంటాయి.
వర్షాకాలంలో లేత పసుపు పచ్చని గుత్తులుగా ఉన్న పుష్పాలు, శీతాకాలంలో సాధారణంగా జంటలుగా సన్నగా. పొడవుగా ఉన్న కాయల్ని కలిగి ఉంటుంది.
ఈ మొక్క ఆకుల్ని నమిలి ఉమ్మేసిన తర్వాత 1-2 గంటల వరకు పంచదార ‘మొదలగు తీపి పదార్థాలు తింటే వాటి తియ్యదనం తెలియదు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
కావున ఈ మొక్కని మధునాశిని, గుడమార అని అంటారు. పాటుకాటుకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సర్పదారుష్టిక లేదా విషాణం అని, కాండం మేక కొమ్ముని పోలి ఉన్నందున మేష శృంగి లేదా అజశృంగి అని సంస్కృతంలో వ్యవహరిస్తారు.
ఆంగ్లంలో స్మాల్ ఇండియన్ ఇపికాక్గా పిలిచే ఈ మొక్కను తెలుగులో ప్రాంతీయంగా పుట్టభద్ర, పుట్ల పొదర అని కూడా వ్యవహరిస్తారు.
ఆస్లిపియడేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయనామం ‘జిమ్నిమా సిల్వెస్ట్రిస్’,
ఎండించిన పొడపత్రి పచారి కొట్లలో కూడా దొరుకుతుంది.
ఈ ఔషధం శరీరంలోని పాంక్రియాస్ అనే అవయవాన్ని చైతన్యపరచి తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడి చక్కెరశాతం తగ్గించడంలో తోడ్పడగలదని భావిస్తున్నారు.
వ్యాధి తీవ్రతను బట్టి 3-6 గ్రా. వరకు పొడపత్రాకు చూర్ణం తీసుకుంటుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది.
లేదా పొడపత్రి, నేరేడు గింజలు, కాకరకాయ చూర్ణాలను ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటినీ కలిపి వుంచుకొని వ్యాధ్యవస్థను బట్టి అరస్పూను లేదా స్పూను పొడిని అరకప్పు నీటిలో కలిపి త్రాగుచుంటే మధుమేహ వ్యాధి అదుపులో వుంటుంది.
పచారీ కొట్లలో దొరికే ముసాంబ్రాన్ని పొడపత్రి రసంతో నూరి బెల్లం, సున్నం కలిపి ఆ గంధాన్ని గంజిలో కలిపి గడ్డలపై పట్టిస్తుంటే అవి అణిగిపోవటమో, పగిలిపోవడయో జరిగి వాటి బాధలు ఉపశమిస్తాయి.
పాటుకాటుకు పొడపత్రి
ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాల్లో ఈ మొక్కలో రెసిన్స్, జిమ్నెమిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, కాల్షియం ఆక్సలేట్, హెంటియో కాంటేన్, పెంటాట్రయా కాంటేన్, ఫైటాల్ అయనోసిటాల్, క్వెర్సిటాల్ మొదలగు అంశాలు న్నట్లు గుర్తించారు.
గిరిజనులు పాటుకాటుకు పొడపత్రి, మిరియాలు కలిపి నూరి పట్టీలా వేస్తారు. నేరేడు గింజలు, పొడపత్రి, మెంతులు, ఉసిరి, పసుపు,
నేలవేము చూర్ణాల్ని సమానంగా కలిపి రోజూ మూడుసార్లు ఆహారానికి ముందు నీటితో సేవిస్తుంటే మధుమేహ వ్యాధి చాలావరకు అదుపులో..
ఉన్నట్లు అనుభవాల ద్వారా తెలుస్తోంది. ఈ ఔషధ సేవన వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.
వ్యాధి నిరోధకశక్తి ‘ పెరుగుతుంది. పొడపత్రి, హారతి కర్పూరం, వేప చిగుళ్ళు, పసుపు, వావిలాకు, ముసాంబ్రంలను సమంగా..
కలిపి నూరి తగినంత నువ్వుల నూనెలో పది నిముషాలు ఉడికించి చల్లార్చి ఒంటికి పట్టించి కొద్దిగంటలాగి వావిలాకులు వేసి కాచిన
నీటితో స్నానం చేస్తుంటే శరీరం నీరు పట్టటం, దుర్వాసన, చర్మంపై వచ్చే గుల్లలు, !ఒంటి నొప్పులు, వాపులు తగ్గుతాయి.
నేతిలో వేయించిన ఇంగువ, తాటి బెల్లం తీసుకుని ఈ రెంటికీ సమంగా – పొడపత్రాకు ముద్ద కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసి వాము,
బెల్లం, అల్లం కషాయం అనుపానంతో ఉదయం, సాయంత్రం రెండ్రెండు మాత్రల వంతున సేవిస్తుంటే కడుపులోని గడ్డలు, కంతులు కరుగుతాయి.
జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధత, కడుపుబ్బరం తగ్గుతాయి. ఆయుర్వేద మందుల విక్రయశాలల్లో దొరికే లోహభస్మ ఒక భాగం,
శిలాజిత్ భస్మ రెండు భాగాలు, శొంఠి రెండు భాగాలు, నేరేడు గింజల చూర్ణం ఆరు భాగాలు, తిప్పసత్తు ఆరు భాగాలు కలిపి ఈ మొత్తానికి సమానంగా..
పొడపత్రి చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం పంచదార వేయని పాలలో కలిపి సేవిస్తుంటే మధుమేహ లక్షణాలు తగ్గడంతోపాటు ..
దీర్ఘకాల మధుమేహం వల్ల కలిగే నరాల బలహీనత, అంగస్తంబన, శీఘ్రస్కలనం మొదలగు సెక్స్ సమస్యలు, కీళ్ళనొప్పులు, రక్తహీనత, తరచుగా మూత్రం మంటగా రావడం, స్త్రీలలో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతాయి.