సప్త నదుల సంగమం సంగమేశ్వరం దిగు వఆలయం ప్రాచీన సంగమేశ్వర స్వామి వారి మహా శివరాత్రి సందర్భంగా ఎనిమిదో తేదీ శుక్రవారం నాడు
బ్రహ్మ ముహూర్తములో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలతో ఉదయం నుండి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు భక్తులకు దర్శన మివ్వనున్నారు .
అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం రెండవ యామ పూజ మహా మంగళ హారతి తో శివరాత్రి పూజా కైంకర్యములు జరుగును
9వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి అభిజిత్ లగ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి వారి కళ్యాణం..
ప్రాచీన సాంప్రదాయ అనుసారంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులకు దిగువ పుష్కర ఘాట్ రాజగోపురం ఎదురుగా ఉండే..
ప్లాట్ ఫామ్ ప్రదేశంలో చలువ కొరకు షామియానాలు వేయించడం జరిగింది ఆలయ ప్రాకారం లోపల యధావిధిగా ఆరు నెలలపాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది
ఉదయం తొమ్మిది నుండి రాత్రి 9 వరకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ లో స్త్రీలకు మూడు సంవత్సరాల పిల్లలకు..
వేరుగా పురుషులకు వేరుగా వృద్ధులకు రెండు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
స్పర్శ దర్శనం మాత్రం ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు స్పర్శ దర్శనం లేదు మహాశివరాత్రి కి ప్రాచీన సంగమేశ్వరాలయం..
మూడు నెలల ముందుగా బయటపడడంతో భక్తులు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అడుగంటిన శ్రీశైల జలాశయం దిగువ పుష్కర ఘాటుకు కిందుగా జలాశయం నీళ్లు వెళ్లిపోవడంతో అంతా బురదమయంగా ఉంది..
ఆయిల్ ఇంజన్ ద్వారా నదిలో నుంచి నీటిని తోడి పోసి ప్రత్యేకంగా 10 డ్రమ్ములలో నది నీళ్లను నింపి స్నానాలకు కాళ్లు కడుక్కోవడానికి
నదీ జలాలను తలపై ప్రోక్షణ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఎగువ పుష్కర్ ఘాట్ నుండి దిగువ పుష్కర ఘాటు వరకు రహదారిని వెడల్పు చేసి వాహనములకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగినది
మార్చి నెలలో 8వ తేదీ శివరాత్రికి ఎక్కువగా ఎండలు ఏర్పడడంతో భక్తులకు ఎండ వేడి ఎక్కువగా కావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం ఏర్పడడం జరుగుతుంది
సాధ్యమైనంతవరకు సంగమేశ్వరాలయంలో వసతులు ఏర్పాటు చేయడం జరిగినది దేవాదాయ శాఖ కార్యనిర్వాహకులు ఈవో మోహన్ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ క్షేత్ర పురోహితులు
సంగమేశ్వరుడి ప్రత్యేకతలు
ఉత్తర భారతదేశంలోని అమరనాథ్,బద్రినాథ్,కేదారం నాథ్ యాత్ర గురించి అందరు వినే ఉంటారు. కొన్ని కాలాలు మాత్రమే ఇక్కడ పరమేశ్వరుడు దర్శమిస్తూ ఉంటాడు.
కాని దక్షిణ భారతదేశంలో అదీ మన అంధ్ర ప్రదేశ్ కూడా అటువంటి క్షైవ క్షేత్రం ఉందని కొంతమందికే తెలుసు సప్తనదులు సంగమించే చోటా…
ఎనిమిది నెలలు నీటిలో నివాసముండి నాలుగు నెలల పాటు మాత్రమే భక్తులకు పరమేశ్వరుడు దర్శనమిచ్చే అటువంటి అపురూపమైన క్షైవ క్షేత్రం సంగమేశ్వరం.
భారత దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకు తలమానికం శ్రీ సప్తనది సంగమేశ్వరం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా పాండవుల ఈ దేవాలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి..
సప్తనది సంగమేశ్వరంలో స్నానం మాచరించి శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను దర్శించాలని మహాభారత ప్రస్తావన.
ఐతే ఇదంతా పూర్వ వైభవమే శ్రీశైలం డ్యాం కట్టడం వల్ల ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కృష్ణా నదిలో కలిసి పోయింది ఎనిమిది నెలలు నీటిలో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది.