తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల..!

Release of 213 prisoners

Release of 213 prisoners

తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల..!

హైదరాబాద్, జులై 03: తెలంగాణలో రాష్ట్రంలో పలువురు ఖైదీల మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయడానికి..

తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీలు విడుదలవుతున్నారు.

అంతే కాకుండా వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది . ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ సందర్భంగా డిజి సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. విడుదలవుతున్న ఖైదీలందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు .

తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ చరిత్రలో ఇదొక ఓ మైలు రాయి లాంటిదని అభిప్రాయ పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి

ఖైదీల కుటుంబ సభ్యులు తమవాళ్లను విడుదలకు చొరవ చూపాలని దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు .

ఈ దరకాస్టులు దృష్టిలో ఉంచుకుని CM రేవంత్ రెడ్డి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారం..

కమిటీ ఒక లిస్ట్ తయారు చేసిందని తెలిపారు. ఆ లిస్ట్‌ను కేబినెట్‌కు పంపా మని.. కేబినెట్ ఆమోదం పొందిన తరువాత..

గవర్న ర్ కూడా ఆమోదించారని డీజీ తెలిపారు.దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలియజేశారు.

జైలుకు వచ్చిన వారిలో నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చమ న్నారు. జైలులో చదువు కుని కొందరు ఖైదీలు పట్టభద్రులు అయ్యారని.. గోల్డ్ మెడల్ కూడా సాధించారని డీజీ చెప్పారు. కాగా ఖైదీలు విడుదల అయ్యాక వారికి ఉపాధి ఎలా అనే అంశంపై సీఎం, గవర్నర్ అడిగారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 70 మంది ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించామన్నారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే.. ఎక్కువ జీతం ఇస్తున్నామని తెలిపారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

కొంత మంది మహిళా ఖైదీ లు తమకు కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి పొందుతామని అడిగారన్నారు. అడిగిన వారందరి కీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా ఉండి సమాజ సేవలో పాలుపంచుకోవాలని సూచించారు

చర్లపల్లి కేంద్ర కార్యాలయం నుండి- 61 ,హైదరాబాద్ కేంద్ర కారాగారం నుండి- 27 , వరంగల్ కేంద్ర కారాగారం నుండి -20 , చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుండి- 31 , మహిళల ప్రత్యేక కారాగారం నుండి -35 , సంగారెడ్డి కేంద్ర కారాగారం నుండి-1 , నిజామాబాద్ కేంద్ర కారాగారం నుండి- 15 , మహబూబ్నగర్ జిల్లా జైలు నుండి- 2 ,నల్లగొండ జిల్లా జైలు నుండి- 4 , ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి- 3,కరీంనగర్ జిల్లా జైలు నుండి- 7 , ఖమ్మం జిల్లా జైలు నుండి -4 , ఆసీఫాబాద్ స్పెషల్ సబ్ జైలు- 3 , మొత్తం 213 మంది నేడు విడుదలవుతున్నారు…

Also Read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top