ఈ నెల 5వ తేదీన కర్నూల్ లో జరిగే ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ లో జరిగే రాయల సీమ సింహ గర్జనకు తరలి రండి….
రాయల సీమ ప్రాంతం వెనుకబాటు తనాన్ని తెలియ చేద్దాం…..
ఇంకా ఎన్నాళ్ళు మోసపోదాం….
ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుకబాటు తనం…….
రాయలసీమ ప్రాంత అభివృద్ధి,హై కోర్ట్ ఏర్పాటు కు గళం విప్పుదాం….
హైకోర్ట్ వ్యతిరేకుల గుండెల్లో నిద్రపోదాం…….
ఒక సారి రాజధానిని కోల్పోయాం…
మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి మేము సిద్దంగా లేము….
కొలిమిగుండ్ల మండల కేంద్రం లో నీ వైయస్సార్ పార్టీ కార్యాలయం లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బొతుల పాపిరెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాయల సీమ ప్రాంత వెనుకబాటు తనం,కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటుకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన కర్నూల్ పట్టణం ఎస్టిబిసి కలశాల మైదానం లో నిర్వహించబోయే రాయల సీమ సింహ గర్జనకు బనగానపల్లె నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరూ పార్టీ లకు,కులాలకు,మతాలకు అతీతంగా పాల్గొని రాయలసీమ ప్రాంత అభివృద్ధి కి ,కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటు కు మద్దతు తెలపాలని బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు పిలుపు నిచ్చారు.
ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమ ,ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే..
మూడు రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తలమానికమైన కర్నూల్ లో..
హై కోర్ట్,విశాఖ పట్టణం లో పరిపాలన రాజధాని ,అమరావతి లో శాసన రాజధాని ఏర్పాటుకు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ప్రజా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అయితే టీడీపీ పార్టీ చంద్ర బాబు నాయుడు అండ్ కో మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్నారు.
అని కేవలం అమరావతి చుట్టూ చంద్ర బాబు అతని అనునాయులకు కట్టబెట్టడం జరిగిందని అందుకే ఒకే చోట అభివృద్ధి వుండాలని చంద్ర బాబు కోరుకొంటున్నారు..
అని అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ను చేసుకొని అన్ని ప్రాంతాల ప్రజలు అందరు కూడ హైదరాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అంత అభివృద్ధి చేసుకొన్న హైదరాబాద్ ను రాష్ట్ర విభజనలో వదులుకోవడం వచ్చిందని గతం లో కూడా కర్నూల్ ను రాజధానిగా కోల్పోవలసి వచ్చిందని మళ్ళీ మళ్ళీ మనం వెనుక బాటు త నానికి గురికాకుండా వుండాలి అంటే మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ తోనే సాధ్యం అని చెప్పారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
వెనుకబాటు తనానికి గురికాకుండా వుండాలి
కాబట్టి మూడు ప్రాంతాల వికేంద్రీకరణ కు వ్యతిరేకుల వారి గుండెలు పెక్కుటిల్లెల రాయలసీమ సింహ గర్జన పేరుతో ఈ నెల 5 వ తేదీన కర్నూల్ పట్టణం లో ఎస్టీ బిసి కళాశాల మైదానం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సభను విజయవంతం చేసి మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సాహసోపేత నిర్ణయానికి సంఘిభావం తెలపాలని బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కొలిమిగుండ్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ అంబటి గురువి రెడ్డి,వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు సత్యాల్ రెడ్డి,మండల వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.